Asianet News TeluguAsianet News Telugu

పెళ్లికి ముందే ‘‘బంధం’’: ఇమ్రాన్ ఖాన్‌, ఆయన భార్యకు ఏడేళ్ల జైలు శిక్ష

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో కోర్టు ఆయనకు జైలు శిక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇమ్రాన్ ఖాన్‌కు కోర్ట్ మూడోసారి శిక్షను విధించింది. చట్టవిరుద్ధంగా వివాహం చేసుకున్న కేసులో ఇమ్రాన్ అతని భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించింది. 

Imran Khan, Wife Given 7-Year Jail Term in Un-Lawful Marriage Case ksp
Author
First Published Feb 3, 2024, 5:41 PM IST | Last Updated Feb 3, 2024, 6:02 PM IST

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో కోర్టు ఆయనకు జైలు శిక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇమ్రాన్ ఖాన్‌కు కోర్ట్ మూడోసారి శిక్షను విధించింది. చట్టవిరుద్ధంగా వివాహం చేసుకున్న కేసులో ఇమ్రాన్ అతని భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించింది. 

తనతో విడాకులు తీసుకున్న వెంటనే ఇమ్రాన్‌ ఖాన్‌ను వివాహం చేసుకున్నప్పుడు రెండు వివాహాల మధ్య విరామం లేదా ‘‘ఇద్దత్’’ పాటించాలనే ఇస్లామిక్ ఆచారాన్ని బుష్రా ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. ఆమె మొదటి భర్త ఖవార్ మనేకా దాఖలు చేసిన కేసుకు సంబంధించి తీర్పు శిక్షను ఖరారు చేసింది. అంతేకాదు.. వివాహానికి ముందే బుష్రా బీబీతో ఇమ్రాన్ ఖాన్ వివాహేతర సంబంధం కలిగి వున్నారని మనేకా ఆరోపించారు. ఈ నేరానికి పాకిస్తాన్‌లో సాధారణంగా మరణశిక్ష విధించబడుతుంది. అడియాలా జైలులో 14 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం ట్రయల్ కోర్టు శుక్రవారం రాత్రి విచారణను ముగించింది. 

పాక్ మీడియా సంస్థ జియో టీవీ నివేదికలో పేర్కొన్న ప్రకారం.. వారం రోజుల వ్యవధిలో ఇమ్రాన్ ఖాన్‌కు ఇది కోర్టు విధించిన మూడో శిక్ష. ఇప్పటికే ఇమ్రాన్‌కు cipher కేసులో 10 ఏళ్లు, Toshokhana కేసులో 14 ఏళ్ల జైలు శిక్షను న్యాయస్థానం విధించిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios