Asianet News TeluguAsianet News Telugu

లగ్జరీఫ్లైట్ లో ప్రయాణం పొదుపా: ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు వెల్లువ

పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ప్రజలు విమర్శలు దాడి చేస్తున్నారు. పొదుపుమంత్రం పటిస్తున్న ఇమ్రాన్ ఖాన్ లగ్జరీ ఫ్లైట్ లో ప్రయాణించడంపై పాకిస్థానీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొదుపు అంటే ఇదేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

Imran khan uses vvip flight in saudi tour
Author
Islamabad, First Published Sep 19, 2018, 8:56 PM IST

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ప్రజలు విమర్శలు దాడి చేస్తున్నారు. పొదుపుమంత్రం పటిస్తున్న ఇమ్రాన్ ఖాన్ లగ్జరీ ఫ్లైట్ లో ప్రయాణించడంపై పాకిస్థానీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొదుపు అంటే ఇదేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

ఇటీవలే ఏర్పడిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పొదుపు మంత్రాన్ని పాటిస్తోంది. అందులో భాగంగా దేశ అధ్యక్షుడితో సహా, మంత్రులు, అధికారులంతా పొదుపు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను మాత్రం దానికి మినహాయింపు అన్నట్లు తన తొలి విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. 

సౌదీ రాజు సల్మాన్‌ బీన్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఆహ్వానం మేరకు సౌదీ వెళ్లిన ఇమ్రాన్‌ వీవీఐపీ వసతులు కలిగిన ప్రత్యేక విమానంలో పర్యటనకు వెళ్లారు.ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సౌదీ రాజుతో ఇమ్రాన్ చర్చించనున్నారు. సౌదీ వెళ్లిన ఇమ్రాన్‌ దుబాయ్‌లో జరిగే పాక్‌-భారత్‌ మ్యాచ్‌ను తిలకించనున్నారు. 

ఇమ్రాన్‌ పాక్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అధికారుల, మంత్రుల ప్రయాణాల్లో కోత విధించారు. అంతేకాదు అంతా సాధారణ వాహణాల్లో ప్రయాణం చేయ్యాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఖర్చుల్లో పొదుపు పాటించాలని ప్రజాధనాన్ని వృథా చేయోద్దంటూ ఆదేశించారు. పొదుపు పాటించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రధాని ఆయన మాత్రం లగ్జరీ విమానాల్లో విదేశాలకు వెళ్లడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికే ప్రయాణ ఖర్చుల్లో కోత విధించిన ఇమ్రాన్ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులతో, మంత్రులతో, ప్రజా ప్రతినిధులతో నిర్వహించే సమావేశాల్లో ఇకపై భోజనాలను రద్దు చేసి దాని స్థానంలో బిస్కెట్లను మాత్రమే అందించాలని ఆదేశించారు. విదేశీయులతో జరిగే సమావేశాలకు ఇది వర్తించదన్నారు. అంతర్గతంగా జరిగే సమావేశాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.  

దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇటీవలే 102 లగ్జరీ కార్లను, గేదెలను వేలంలో అమ్మేయాలని పాక్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇమ్రాన్‌ తన తొలి పర్యటనకే ప్రత్యేక సదుపాయాలున్న వీవీఐపీ విమానాన్ని ఉపయోగించడంపై రాజకీయ పార్టీలు గుర్రుమంటున్నాయి. గత ఏడాది చివరినాటికి పాక్ ఆర్థిక వ్యవస్థలో 87 శాతం అంటే రూ.30 లక్షల కోట్ల అప్పు ఉంది.  కాగా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజు అజీజ్‌తో ఇమ్రాన్‌ భేటీ కానున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios