Imran Khan: తమ పార్టీని నిషేధిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. 

Imran Khan: పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ తన రాజకీయ పార్టీని నిషేధించిన సందర్భంలో ప్లాన్-బిని వెల్లడించారు. తమ పార్టీపై నిషేధం విధించినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొంటానని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఒకవేళ తన పార్టీని నిషేధించిన పక్షంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ఖాన్ చెప్పారు. కొత్త పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసినా .. తాము గెలుస్తామని చెప్పారు.

పాకిస్తాన్ లో మే 9న దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో విఫలమైనందుకు పలువురు ఆర్మీ అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. PTIపై నిషేధం విధించాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన పలువురు వ్యక్తులు డిమాండ్ చేస్తున్నారు. 

నిషేధం ఒక్కటే పరిష్కారం

పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ను నిషేధించడమే ఏకైక పరిష్కారమని పాకిస్థాన్ అంతర్గత మంత్రి రాణా సనావుల్లా అన్నారు. కాగా, పీటీఐపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. మరోవైపు.. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ను నిషేధించే ఏ చర్యను తమ పార్టీ ఏ మాత్రం వ్యతిరేకించదని చెప్పారు.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి భవిష్యత్ వ్యూహాలపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను నిక్కీ ఆసియా ప్రశ్నించారు. పీటీఐపై నిషేధం విధించే అవకాశం ఉందనే ప్రశ్నకు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తాము పార్టీని నిషేధిస్తే.. తాము కొత్త పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తామనీ, ఎన్నికలలో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై అనర్హత వేటు వేసినా.. జైల్లో పెట్టినా ఎన్నికల్లో తన పార్టీ గెలుస్తుందని అన్నారు. అలాగే.. బెదిరింపులతో పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వ పదవీకాలం ఆగస్టు 14తో ముగియడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం త్వరలో ప్రకటించనున్నది.