పాకిస్తాన్  తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ పేరును ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు. పాకిస్తాన్ పార్లమెంట్ ను ఇమ్రాన్ ఖాన్  రద్దు చేస్తూ నిన్న నిర్ణయం తీసుకొన్నారు. 

ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ Gulzar Ahmed పేరును Imran Khan ప్రతిపాదించారు. Pakistan జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ఆదివారం నాడు నిర్ణయం తీసుకొన్నారు.ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపాదించిన అవిశ్వాసాన్ని పార్లమెంట్ స్పీకర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. 

జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ఇమ్రాన్ ఖాన్ సిఫారసు చేశారు. ఆదివారం నాడు పాకిస్తాన్ అధ్యక్షుడితో భేటీ అయిన తర్వాత జాతీయ అసెంబ్లీ రద్దుకు సంబంధించి అధ్యక్షుడు నోటిఫై కూడా చేశారు.

జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.ఈ విషయమై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ పై ఈ నెల 5న సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది. జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో పాకిస్తాన్ లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 90రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

జాతీయ అసెంబ్లీలో 342 మంది ఎంపీలున్నారు. విపక్షాలతో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. సభలో న్యాయశాఖ మంత్రి పవాబ్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానం వ్యవహరంలో విదేశీ శక్తుల హస్తం ఉందన్నారు. పాకిస్తాన్ నిబంధనలకు విరుద్దంగా ఉన్న అవిశ్వాసాన్ని తిరస్కరిస్తున్నట్టుగా పాకి డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు విదేశీ కుట్రకు వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీ వద్ద ఇవాళ నిరసనలు చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు.