Asianet News TeluguAsianet News Telugu

పాక్ ప్ర‌ధాని ఆడియో క్లిప్ లీక్.. రాజీనామా చేయాల‌ని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ .. ఇంత‌కీ ఆ ఆడియోలో ఏముంది? 

పాకిస్థాన్ లో  ఆడియో క్లిప్పుల క‌ల‌క‌లం రేగింది.  ఆ దేశ‌ కేబినెట్ సభ్యులు, ప్రభుత్వ అధికారులకు సంబంధించిన‌ ఆడియో లీక్ కావడంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ రాజీనామా చేయాలని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. 

Imran Khan demands Shehbaz Sharif's resignation over Pak PMO audio leaks
Author
First Published Sep 27, 2022, 2:06 AM IST

పాకిస్థాన్‌లో రాజకీయ కలకలం కొనసాగుతోంది. పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌కి సంబంధించిన ఓ ర‌హ‌స్య ఆడియో లీక్ అయింది. దీంతో అక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు చేలారేగింది. దీంతో పాకిస్థాన్ బహిష్కృత ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్..  షాబాజ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌ధాని షాబాజ్ షరీఫ్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ లో భ‌ద్ర‌తా లోపం బ‌య‌ట‌ప‌డింద‌నీ, దేశానికి ర‌క్ష‌ణ ఎక్క‌డ ఉంద‌ని ప్ర‌శ్నించారు.  ఓ  విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ఆయన ఈ డిమాండ్ చేశారు. 

లీకైన ఆడియోలో షహబాజ్ తన మేనకోడలు మరియమ్ నవాజ్ భర్త రహీల్ మునీర్ కోసం భారత్ నుంచి కొన్ని మెషినరీని తీసుకురావడం గురించి మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. షాబాజ్‌కి అవమానం మిగిలి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, లేకుంటే ఇంటికి పంపిస్తామ‌ని విమ‌ర్శించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్‌కి సంబంధించిన రెండో ఆడియోను త్వరలో లీక్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. అందులో ఆమె త‌న గురించి స్టేట్‌మెంట్ ఇచ్చింద‌ని ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 

ప్రధాని , క్యాబినెట్ అధికారుల మధ్య జరిగిన అనధికారిక సంభాషణలకు సంబంధించిన ఆడియో క్లిప్‌లు బయటికి రావడంతో భద్రతా లోపంపై పాకిస్థాన్ నిఘా విభాగం విచారణకు ఆదేశించింది. భద్రతా ఉల్లంఘనపై దర్యాప్తు చేయాలని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరోను సూచించింది. 

లీకైన ఆడియోలో ఏముంది?

సోషల్ మీడియాలో రెండు ఆడియో లీక్‌లు జరిగాయి. ఆ ఆడియో క్లిప్ ల‌లో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తన మేనకోడలు, అధికార పీఎంఎల్-ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ గురించి చర్చించిన‌ట్టు తెలుస్తుంది. ఇందులో పాక్ ప్ర‌ధాని ష‌రీఫ్ త‌న‌ అల్లుడి కోసం భారత్ నుంచి పవర్ ప్లాంట్లను దిగుమతి చేసుకోవాలని కోరాడు. మరియమ్ తన కుమారుడు రహీల్ అభ్యర్థన మేరకు భారత్ నుంచి కొన్ని యంత్రాలను తీసుకురావాలనుకుంటున్నట్లు షరీఫ్ అధికారికి తెలిపారు. ఇందులో సగం యంత్రాలు పాకిస్థాన్‌కు వచ్చాయని, మిగిలిన యంత్రాలు వేచి ఉన్నాయని అధికారి తెలిపారు. అయితే ఈ విషయం చాలా సీరియస్‌గా ఉందని ఆ అధికారి ప్రధానిని హెచ్చరించారు. 

ఇక రెండవ ఆడియోలో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్, కేంద్ర హోం మంత్రి రాణా సనావుల్లా, కేంద్ర రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అజం నజీర్ తారాద్, కేంద్ర ప్రణాళికా మంత్రి అహ్సన్ ఇక్బాల్‌ల మ‌ధ్య సంభాష‌ణలు ఉన్న‌ట్టు తెలుస్తోంది.  వీరంతా ప్రధాని నివాసంలో సమావేశమై.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ అంటే పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ నాయకుల‌ రాజీనామాలపై చర్చిన‌ట్టు..  రాజీనామాలను ఆమోదించడానికి నవాజ్ షరీఫ్ అనుమతి గురించి ప్ర‌స్త‌వించిన‌ట్టు తెలుస్తుంది. 

ఆడియో క్లిప్ లీక్ కుంభకోణం పాలక కూటమిలోని ప్రధాన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్)నే కాకుండా మొత్తం పాకిస్థాన్ ప్రభుత్వ భద్రతా వ్యవస్థను కదిలించింది. ఈ ఘటనతో దేశంలో ప్రధాని కార్యాలయ భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు, ప్రధాని షాబాజ్ షరీఫ్ కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తుల విశ్వసనీయతపై కళంకం నెల‌కొంది. 

ఆడియో క్లిప్‌లలో కీల‌క రాజకీయ అంశాలు బయటపడ్డాయని, అవి దిగర్ హై అని ఫవాద్ చౌదరి ట్వీట్‌లో పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో పీటీఐ నేత, మాజీ మంత్రి షిరీన్ మజారీ కూడా స్పందించారు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఎవరైనా భద్రత లేదా విదేశాంగ విధానానికి సంబంధించిన రహస్య చర్చలను వినవచ్చు అనే సమస్య ఉద్భవించిందనీ, ఇది ప్రధానమంత్రి కార్యాలయ భద్రతను ఉల్లంఘించిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్రధానమంత్రి కార్యాలయంపై ఎవరు గూఢచర్యం చేసారు? మరియు ఎవరి ఆజ్ఞపై ఇది జరిగింది? రాజకీయాలతో పాటు పరిపాలనపై షాబాజ్ షరీఫ్‌కు ఉన్న పట్టు బలహీనపడటానికి ఈ సంఘటన సంకేతమ‌ని రాజ‌కీయ‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios