Imran Khan: దేశంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లే తమ ప్రధానమంత్రిగా ఎన్నుకుంటార‌ని, అది న్యాయ‌బ‌ద్ద‌మైన‌, స్వేచ్ఛా యుత‌ ఎన్నికల ద్వారానే సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. దేశ అంత‌ర్గ‌త విష‌యంలో విదేశీ శ‌క్తుల పాత్ర ఉంద‌ని అన్నారు. 

Imran Khan: పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం జరిగిన జనరల్ అసెంబ్లీ అవిశ్వాస ఓటింగ్ లో ఇమ్రాన్ ఖాన్ ఓటమిపాలయ్యారు. ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా.. 174 ఓట్లు రావ‌డంతో ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం ప‌డిపోయింది. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష పార్టీ.. ప్రధానమంత్రి పదవికి షరీఫ్ అభ్యర్థిత్వాన్ని సూచించింది. అత‌ని అభ్య‌ర్థ్యాన్ని ప్రతిప‌క్షాలు బ‌ల‌ప‌రచ‌డంతో 23వ ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్‌(Shehbaz sharif) ను ఎన్నిక‌య్యాడు.

పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో తక్షణమే ఎన్నికలు( Elections) నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ త‌న ట్విట్టర్‌లో ఇలా రాసుకోచ్చారు. "ప్రజలు తమ ప్రధానమంత్రిగా ఎవరిని ఎంచుకోవాలో.. న్యాయమైన, స్వేచ్ఛా ఎన్నికల ద్వారా నిర్ణయించనివ్వండి. అలాగే తాను కూడా ఏప్రిల్ 13న పెషావర్ లో ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. "మేము తక్షణమే ఎన్నికలను డిమాండ్ చేస్తున్నాము, అదే ఏకైక మార్గం -- ప్రజలు తమ ప్రధానమంత్రిగా ఎవరిని నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఎన్నికల ద్వారా నిర్ణయించుకోవాలి" అని ఆయన ట్వీట్ చేశారు. పాకిస్తాన్ ఒక స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా సృష్టించబడినందున ప్రజలందరూ ర్యాలీలో పాల్గొనాల‌ని పేర్కొన్నారు. 

ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ శనివారం అర్థరాత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీలో జరిగింది, 174 మంది సభ్యులు తమ ఓట్లను బహిష్కరించిన తీర్మానానికి అనుకూలంగా వేయ‌డంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్ప కూలింది. ప్రతిప‌క్షాలు మియాన్ ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ ను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా బ‌ల‌ప‌ర‌చ‌డంతో పాకిస్థాన్ 23వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం దేశ జాతీయ అసెంబ్లీచే ఎన్నికైన కొన్ని గంటల తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు.