Pak PM Imran Khan: తనను గద్దె దించడానికి విదేశీ కుట్ర జరుగుతుందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. విదేశీ కుట్రదారుల ఎత్తులకు అనుగుణంగా పాకిస్థాన్ రాజకీయ నాయకులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఒక వేళ తన పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదించబడితే.. నిరసనగా.. ప్రజలు వీధి ప్రదర్శనలకు దిగాలని ఇమ్రాన్‌ఖాన్ కోరారు. ఆదివారం నాడు ఇమ్రాన్‌ఖాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్నది. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయం.
Pak PM Imran Khan: ఇస్లామాబాద్‌లో విదేశీ కుట్రదారులు నాయకత్వాన్ని మార్చాలని చూస్తున్నారని మరోసారి నొక్కిచెప్పిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా. వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలు వీధి ప్రదర్శనలకు దిగాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కోరారు. ఆదివారం నాడు ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్నది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ శనివారం ప్రభుత్వ అధికారిక టీవీ చానెల్ ARY న్యూస్ ద్వారా జాతినుద్దేశించి మాట్లాడారు.
ఒకవేళ ఇటువంటి ఘటనలు మరే దేశంలోనైనా జరిగితే ప్రజలు వీధుల్లోకి వస్తారు. మీ అందరికీ పిలుపునిస్తున్నా.. ఈ రోజు, రేపు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపాలని కోరుతున్నా. జాతి ప్రయోజనాల రీత్యా మీరు మీ అంతరాత్మ ప్రబోధం మేరకు పని చేయండి అని ఇమ్రాన్‌ఖాన్ పిలుపునిచ్చారు. "ఈరోజు రేపు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపాలని కోరుతున్నా. జాతి ప్రయోజనాల కోసం మీ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకోగలరని తెలిపారు. జాతి ప్రయోజనాల కోసం ఇలా చేయాలి. అలా చేయమని ఏ పార్టీని మిమ్మల్ని బలవంతం చేయకూడదు. భవిష్యత్తు కోసం మీరు వీధుల్లోకి రావాలి. మీ పిల్లల గురించి. మీరందరూ బయటకు వెళ్లి మీరు అప్రమత్తంగా ఉన్నారని చూపించండి" అని ఇమ్రాన్ ఖాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
అవిశ్వాసానికి మెజారిటీ
విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగేలా కనిపిస్తుంది. మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ముందుగా రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇమ్రాన్‌ఖాన్ మాత్రం ససేమిరా అంటున్నారు. చివరి బంతి వరకు ఆడతానని స్పష్టం చేశారు. అవిశ్వాస ఓటుతో తనను బయటకు పంపేయడాన్ని ఆమోదించబోనని ఇమ్రాన్‌ఖాన్ అన్నట్లు తెలుస్తున్నది.
ముందస్తు ఎన్నికలే బెస్ట్ ఆప్షన్ అని నమ్ముతున్నాననీ, రాజీనామా గురించి తనెప్పుడూ ఆలోచించలేదనీ, అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా.. చివరి నిమిషం వరకు పోరాడతానని ఆయన అన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉందని, అయితే తాను భయపడబోనని, స్వతంత్ర, ప్రజాస్వామ్య పాకిస్తాన్ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నాడు.
తనను ప్రధానిగా తొలగించేందుకు విదేశీ కుట్ర జరుగుతుందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. విదేశీ కుట్రదారుల ఎత్తులకు అనుగుణంగా పాకిస్థాన్ రాజకీయ నాయకులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కుట్ర దారుల ఆటలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు.
మైనారిటీలో ఇమ్రాన్‌ఖాన్ సర్కార్
ఇమ్రాన్‌ఖాన్ సారధ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) మిత్రపక్షాలుగా ఉన్న బెలూచిస్తాన్ అవామీ పార్టీ, ముత్తాహిద ఖ్వామి మూవ్‌మెంట్ (పాకిస్థాన్) పార్టీలు విపక్షాలకు మద్దతు తెలిపాయి. దీంతో ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ మైనారిటీలో పడింది. ఇమ్రాన్ ఖాన్ పై ఆర్థిక దుర్వినియోగం, విదేశాంగ-విధానం గందరగోళానికి పాల్పడ్డారని ఆరోపించారు.
పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో ఏ ప్రధాని కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న ప్రధానుల్లో ఇమ్రాన్‌ఖాన్ మూడో వ్యక్తి అవుతారు. ఇంతకుముందు బెనజీర్ భుట్టో, షౌకత్ అజీజ్ విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఇమ్రాన్‌ఖాన్ కీలకమైన మిలిటరీ మద్దతు కోల్పోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
