2007లో సింగిల్ హార్ట్ షేప్డ్ గ్లాసెస్ మ్యూజిక్ వీడియో కోసం వెళ్లినప్పుడు.. కెమేరా ముందే.. తనపై అత్యాచారం పాల్పడ్డాడని ఆమె ఆరోపించారరు.

అమెరికన్ నటి, మ్యూజీషియన్ ఇవాన్ రాచెల్ వుడ్.. సంచలన కామెంట్స్ చేశారు. తనపై మార్లిన్ మాన్సన్ అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించారు. 2007లో సింగిల్ హార్ట్ షేప్డ్ గ్లాసెస్ మ్యూజిక్ వీడియో కోసం వెళ్లినప్పుడు.. కెమేరా ముందే.. తనపై అత్యాచారం పాల్పడ్డాడని ఆమె ఆరోపించారరు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇవాన్ రాచెల్ వుడ్ జీవితం, ఆమె కెరీర్ ఆధారంగా.. ఇటీవల 'ఫీనిక్స్ రైజింగ్' అనే కొత్త డాక్యుమెంటరీ చేశారు. దీనిని 2022 సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రదర్శించారు.

View post on Instagram

ఆ వీడియోలో ప్రకారం.. గతంలో.. తాను మ్యూజిక్ వీడియో చేస్తున్నప్పుడు.. నటిస్తున్నట్లే నటించి.. తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. తనకు స్పృహ తప్పేలా చేసి.. కెమేరాల ముందే అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. 

View post on Instagram

‘‘ ఇప్పటి వరకు నేను సెట్స్ లో.. అన్ ప్రొఫెషనల్ గా ఎప్పుడూ లేనని.. అయితే.. ఆ రోజు మాత్రం తాను సురక్షితంగా లేనని’’ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఆ ఘటన తర్వాత తనకు తానుగా ఎలా వాదించుకోవాలో.. తనకు తెలియలేదని ఆమె చెప్పింది. తనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని.. అందుకే మాట్లాడలేకపోయానని ఆమె చెప్పారు.