నేను మలాలాను కాదు, భారత్‌లో సురక్షితంగా ఉన్నా: యూకేలో కాశ్మీరి జర్నలిస్ట్ యానా మీర్
యూకే పార్లమెంట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కాశ్మీరీ జర్నలిస్టు యానా మీర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. కాశ్మీర్ పై సాగుతున్న ప్రచారాన్ని మీర్ తోసిపుచ్చారు.
న్యూఢిల్లీ: యూకే పార్లమెంట్ నిర్వహించిన సంకల్ప్ దివస్ కార్యక్రమంలో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కాశ్మీర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త యానామీర్ తీవ్రంగా ఖండించారు.
తీవ్రవాదుల బెదిరింపుల కారణంగా తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన మలాలా యూసుఫ్ జాయ్ ను కాదని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. తాను భారత దేశంలో స్వేచ్ఛగా , సురక్షితంగా ఉన్నట్టుగా ఆమె స్పష్టం చేశారు. భారత దేశం తన మాతృభూమిగా ఆమె పేర్కొన్నారు.
తాను మలాలా యూసుఫ్ జాయ్ ని కాదన్నారు. తాను భారత దేశంలో స్వేచ్ఛగా , సురక్షితంగా ఉన్నానని చెప్పారు. భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగమని తెలిపారు. తాను మీ దేశంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం లేదని చెప్పారు.
తాను ఎప్పటికి మలాలా యూసుఫ్ జాయ్ గా ఉండనన్నారు. కానీ మలాలా తన దేశం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇతర ప్రసార మాథ్యమాల్లో కాశ్మీర్ లో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా తప్పుడు ప్రచారం చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టుగా యూకే పార్లమెంట్ లో ఆమె చెప్పారు.
మతం ప్రాతిపదికన భారతీయులను పోలరైజ్ చేయడాన్ని ఆపాలని ఆమె కోరారు. ఈ రకమైన విధానాలతో తమను విచ్ఛిన్నంచేయడానికి అనుమతించబోమని యానా మీర్ స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మీడియాలో లేదా అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలపై భారత దేశాన్ని కించపర్చడాన్ని మానివేయాలని తాను ఆశిస్తున్నట్టుగా మీర్ చెప్పారు.ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే వేలాది మంది కాశ్మీర్ తల్లులు తమ కుమారులను కోల్పోయారు. కాశ్మీరి సమాజాన్ని ప్రశాంతంగా జీవించనివ్వండి ధన్యవాదాలు... జై హింద్ అంటూ ఆమె పేర్కొన్నారు.
ఆమె చేసిన కృషికి మీర్ ను డైవర్శిటీ అంబాసిడర్ అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూకే పార్లమెంట్ సభ్యులు, కమ్యూనిటీ నాయకులు, సహా వందమందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ యూకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కాశ్మీర్ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ దృశ్యం సమగ్ర అవలోకనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. జమ్మూ కాశ్మీర్ విభిన్న స్వభావాన్ని నొక్కి చెప్పింది. బహుళ సాంస్కృతిక, బహుమత , బహు బాషా లక్షణాలను నొక్కి చెప్పింది.భారత్ పట్ల, దేశ ప్రజల పట్ల ఆమెకు ఉన్న తిరుగులేని నిబద్దతను మీర్ మాటలు ప్రతిబింబించాయి.