ఇరాన్ లో మరో ఘాతుకం వెలుగు చూసింది. విద్యనుంచి బాలికలను దూరం చేయడానికి వందలాదిమంది స్కూలు విద్యార్థినుల మీద విషప్రయోగం చేశారు.  

ఇరాన్ : ఇరాన్లో పరిస్థితులు రోజుకు భయాందోళనలు కలిగిస్తున్నాయి ఇప్పటికే ఆ దేశంలో మహిళలపై జరుగుతున్న హింసకాండ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో ఘాతకం వెలుగులోకి వచ్చింది. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగిందన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. బాలికలను విద్య నుండి దూరం చేయాలని.. వారి విద్యను ఆపేయాలన్న ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా సమాచారం.

ఇరాన్లోని టెహ్రాస్ లో కోమ్ లోని ఓ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లుగా డిప్యూటీ హెల్త్ మినిస్టర్ యునెస్ పనాహి తెలిపారు. ఇరాన్ స్థానిక మీడియా.. విద్యార్థినులపై విష ప్రయోగం జరిగిన వెంటనే కొంతమంది అన్ని స్కూల్స్లో మూసేయాలని.. అందులో ముఖ్యంగా గర్ల్స్ స్కూల్స్ ని మూసివేయాలని కోరినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇంత దారుణమైన ఘటన జరిగిన ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎవరిని అదుపులోకి తీసుకోకపోవడం… దీని మీద ఎలాంటి అరెస్టులు

ఇటలీలో నౌక ప్రమాదంలో 12 మంది చిన్నారులు సహా, 59 మంది మృతి జరగకపోవడం గమనార్హం. 

ఇంత దారుణమైన ఘటన విషయంలో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిమీద అధికారులను నిలదీసేందుకు నగర గవర్నరేట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి కారణాలను కనుక్కోవడానికి విద్యా మంత్రిత్వ శాఖలు, ఇంటిలిజెన్స్ ప్రయత్నిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి జహ్రోమి ప్రకటించారు. సత్వరమే ఈ ఘటనకు కారణమైన వాటి మీద దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇదిలా ఉండగా నిరుడు వస్త్రధారణ నియమావళి ఉల్లంఘించినందుకు 22యేళ్ల ఇరానియన్ కుర్ద్ మహ్సా అమినిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 16న కస్టడీలో అమిని మరణించారు. అప్పటినుంచి ఇరాన్ లో నిరసనలు తీవ్రస్థాయిలో వెల్లివెత్తుతున్నాయి.