మంత్రిత్వ కార్యాలయం పై మానవ బాంబు దాడి, 13 మంది దుర్మరణం

human bomb blast at ministry building in afghanistan
Highlights

మరో 31 మందికి తీవ్ర గాయాలు...

అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ప్రభుత్వోద్యులే లక్ష్యంగా జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది మృతిచెందారు. మరో 31 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ  బాంబు దాడి అప్థానిస్థాన్  పునరావాసం, అభివృద్ధి, పోలీసు, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఉన్న భవనాల వద్ద జరిగింది. మృతుల్లో మహిళలతో పాటు పలువురు చిన్నారులు కూడా ఉన్నారు.

కొద్ది రోజుల్లోనే పవిత్రమైన రంజాన్‌ పండుగ ఉండటంతో ఉద్యోగులు ముందుగానే ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఈ బాంబు పేలుడు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మద్యాహ్నం బస్సుు కోసం వేచి వున్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు, దీంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. 

ఐఎస్ ఉగ్రవాద సంస్థే ఈ దాడికి పాల్పడి ఉంటుందని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. ఈదుల్‌ ఫితర్‌ను పురస్కరించుకుని 3 రోజులపాటు కాల్పులు జరపబోమని ప్రకటించిన ఉగ్రవాద సంస్థలు ఈ దాడికి పాల్పడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు పండగ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
 

loader