Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ చైనా ల్యాబుల్లోనే పుట్టింది, ఆధారాలున్నాయి: అమెరికా విదేశాంగ మంత్రి

కరోనా వైరస్ చైనా లోని వుహాన్ ల్యాబుల్లోనే పుట్టిందని మరోసారి అమెరికా పునరుద్ఘాటించింది. అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పొంపీయో మాట్లాడుతూ... చైనా వుహాన్ ల్యాబుల్లోనే ఈ కరోనా వైరస్ పుట్టిందనడానికి బోలెడు సాక్షలున్నాయని అన్నారు. 

Huge Evidence to say Virus Came From Wuhan Lab: US Secretary Of State
Author
Washington D.C., First Published May 4, 2020, 8:51 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనా లోని వుహాన్ ల్యాబుల్లోనే పుట్టిందని మరోసారి అమెరికా పునరుద్ఘాటించింది. అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పొంపీయో మాట్లాడుతూ... చైనా వుహాన్ ల్యాబుల్లోనే ఈ కరోనా వైరస్ పుట్టిందనడానికి బోలెడు సాక్షలున్నాయని అన్నారు. 

కరోనా వైరస్ విషయంలో చైనా వైఖరిని తప్పుబడుతూనే.... ఈ వైరస్ ని కావాలనే చైనా విడుదల చేసిందా అనే విషయాన్నీ మాత్రం చెప్పలేదు. కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై మాత్రం ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ కరోనా విషయంలో చైనా తీరును తీవ్రస్థాయిలో విమర్శించారు. అతి ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టి, పరిస్థితి అంతా బాగానే ఉందన్నట్టు వ్యవహరించడం వల్ల 35 లక్షల మంది ఈ వైరస్ బారిన పడితే... దాదాపు, 2లక్షల నలభై వేలమంది మరణించారని, దీనంతటికి చైనా వ్యవహరించిన తీరే కారణమని ట్రంప్ ఆక్షేపించారు. 

అమెరికా నిఘా వర్గాలను ఈ విషయమై మరింత సమాచారాన్ని సేకరించమని ట్రంప్ చెప్పారని, వారు ఇదే పనిలో ఉండి ఈ సాక్ష్యాధారాలను సంపాదించారని మైక్ అన్నారు. 

ఇకపోతే... చైనా నుంచి ప్రతినెలా బిలియన్ డాలర్ల దిగుమతి సుంకాన్ని తాను రాబడుతున్నందుకు చైనా తన మీద కక్ష గట్టిందని, తాను రెండవదఫా ఎన్నికల్లోను గెలవడం చైనాకి ఇష్టం లేదని ఆరోపించారు ట్రంప్. 

ప్రస్తుత అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమొక్రాట్ జో బిడెన్ గెలవాలని చైనా కోరుకుంటుందని, గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జో బిడెన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన విషయం అందరికి గుర్తుండే ఉంటుందని, ఆకాలంలో అమెరికా నుంచి చైనా చాలా తీసుకుందని ట్రంప్ ఆక్షేపించారు. 

ఒకరకంగా ఆ ఎనిమిదేళ్ల కాలంలో చైనా అమెరికా నుంచి ఎంతో సహాయం పొంది తిరిగి ఇచ్చింది మాత్రం శూన్యం అని అన్నాడు ట్రంప్. 

తాను వచ్చిన తరువాత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని అమెరికాకు న్యాయంగా రావాల్సిన వాటాను అందించేందుకు కృషి చేసానని అన్నాడు. కానీ ఈ కరోనా వైరస్ కాలంలో అదంతా కనబడకుండా పోయిందని అన్నాడు ట్రంప్. 

తాను ఎవరిని వ్యక్తిగతంగా దూషించాలనుకోవడంలేదు కానీ... నిద్రపోయే బిడెన్ ను అధ్యక్షుడిగా చేయాలనీ చైనా భావిస్తోందని ఫైర్ అయ్యాడు ట్రంప్. కరోనా నష్టానికి గాను చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులు, సేవలపై సుంకాలు విధించనున్నట్టు స్పష్టం, చేసాడు ట్రంప్. 

Follow Us:
Download App:
  • android
  • ios