న్యూ ఇయర్ రోజు జపాన్ లో భారీ భూకంపం.. సునామీ వచ్చే ఛాన్స్..
Japan Earthquake : కొత్త సంవత్సరం మొదటి రోజు జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.5గా నమోదు అయ్యింది. ఈ ప్రకంపనల వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Earthquake in Japan : ప్రపంచమంతా ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో జపాన్ భారీ భూకంపంతో ఉలిక్కిపడింది. పశ్చిమ జపాన్ లో సంభవించిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదు అయ్యింది. అయితే ఈ భారీ భూప్రకంపనల వల్ల సునామీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ దేశ వాయువ్య తీరానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
జపాన్ సముద్ర తీరం వెంబడి నిగటా, టోయామా, యమగాటా, ఫుకుయి, హ్యోగో ప్రిఫెక్చర్లకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) ప్రకారం ఇషికావా, పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.4గా నమోదైందని పేర్కొంది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది.
కాబట్టి ప్రజలు తీర ప్రాంతాలను వదిలి భవనాల పైభాగానికి లేదా ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని జపాన్ పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ ‘ఎన్ హెచ్ కే’ కోరింది. రాజధాని టోక్యోతో పాటు కాంటో ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లు ‘జపాన్ టైమ్స్’ తెలిపింది. కాగా.. ఈ ప్రకంపనల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" అని పిలిచే ప్రపంచంలో అత్యధిక భూకంప ప్రభావిత ప్రాంతంలో జపాన్ ఉంది. అందుకే ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2011 మార్చి 11న జపాన్ ఈశాన్య తీరంలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ సునామీని సృష్టించింది. దీని వల్ల 18,000 మంది మరణించారు. 1923లో లక్ష మందిని పొట్టనబెట్టుకున్న 1923లో గ్రేట్ కాంటో భూకంపం సంభవించింది. దీనికి 2023 సెప్టెంబర్ తో వందేళ్లు పూర్తి అయ్యాయి. ఆ సమయంలో భూకంపం టోక్యోకు నైరుతి దిశలో ఉన్న సగామిహరా ప్రాంతంలో 7.9 తీవ్రతతో వచ్చింది.
ఆ ప్రకంపనలు సగామిహరా ప్రాంతంలో విస్తృతమైన నరకాన్ని సృష్టించింది. భూకంపం వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో చాలా మంది మరణించారు. దాదాపు 3,00,000 జపనీస్ పేపర్ అండ్ వుడ్ ఇళ్లు దగ్ధమయ్యాయి. దీని వల్ల ఆ దేశం పెద్ద సామాజిక, ఆర్థిక నష్టాన్ని చవిచూసింది.