హాంకాంగ్ మోడల్ దారుణ హత్కు గురైంది. ఆమెను ముక్కలుగా నరికి హతమార్చారు. తాయ్ పో జిల్లాలో శివారులోని ఓ ఇంటిలో ఫ్రిడ్జ్‌లో ఆమె కాళ్లు లభించాయి. అక్కడే ఆమెను ముక్కలు చేయడానికి వినియోగించిన పరికరాలనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల సహా ఇతర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

న్యూఢిల్లీ: హాంకాంగ్‌లో 28 ఏళ్ల మోడల్ అబ్బి చోయ్ దారుణ హత్యకు గురైంది. ఎక్కడికక్కడే ఆమెను నరికి హత్య చేశారు. ఆమె బాడీకి సంబంధించిన కొన్ని భాగాలు శుక్రవారం లభించాయని హాంకాంగ్ పోలీసులు తెలిపారు. అయితే, ఆమె తల, దేహం, చేతులు ఇంకా కనుగొనాల్సి ఉన్నదని వివరించారు. ఆమె రెండు కాళ్లు ఓ ఫ్రిడ్జ్‌లో లభించాయని చెప్పారు. అలాగే, ఓ మీట్ స్లైసర్, ఎలక్ట్రిక్ రంపం కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

ఈ ఘటన హాంకాంగ్‌‌కు చెందిన అబ్బి చోయ్ లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె ఇటీవలే లోఫిషల్ మొనాకో అనే ఫ్యాషన్ మ్యాగజైన్ డిజిటల్ కవర్ పై కనిపించింది. ఆ తర్వాత లోకల్ టాబ్లాయిడ్‌లలో ఆమె తరుచూ దర్శనం ఇస్తున్నది. ఆమె గురువారం నుంచి కనిపించడం లేదు. తాయ్ పో జిల్లాలో చివరగా ఆమె కనిపించింది. అక్కడే ఆమె విగత జీవై కనిపించింది. రూరల్ తాయ్ పో జిల్లాలో క్రైమ్ సీన్ నుంచి మీట్ స్లైసర్, ఎలక్ట్రిక్ సా ను పోలీసులు రికవరీ చేసుకున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాయ్ పో జిల్లాలో శివారులోని ఓ ఇంటిలోని ఫ్రిడ్జ్‌లో ఆమె రెండు కాళ్లు కనిపించాయి. అలాగే, ఆమె బాడీని వేరు చేయడానికి ఉపయోగించిన టూల్స్ కనిపించినట్టు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికి నలుగురిని అరెస్టు చేశారు. ముగ్గురిపై ఈ కేసు అభియోగాలు ఉన్నాయి. అయితే, వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు. అభియోగాలు మోపిన వారిని సోమవారం కోర్టులో హాజరుపరచబోతున్నట్టు తెలుస్తున్నది.

Also Read: గ్లాసులో బీర్ ఎలా పోస్తున్నారు? ఒక వైపు వంచి పోస్తే పొట్టకు మంచిది కాదు! ఎలా పోయాలంటే?

లోకల్ బ్రాడ్‌క్యాస్టర్ టీవీబీ పోలీసుల వ్యాఖ్యలను ఉటంకిస్తూ కీలక విషయాలను రిపోర్ట్ చేసింది. చోయ్ మాజీ భర్త అలెక్స్ క్వాంగ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేసినట్టు తెలిపింది. కానీ, అతనిపై అభియోగాలు మోపలేదు. కాగా, ఆమె మాజీ మామా, ఆయన తమ్ముడిపై మర్డర్ అభియోగాలు మోపింది. చోయ్ మాజీ అత్తను కేసు దర్యాప్తులో అడ్డంకులు సృష్టిస్తున్నదని అరెస్టు చేశారు.