కరోనా కష్టకాలం: వైట్ హౌజ్ లో శాంతిమంత్రాన్ని పఠించిన హిందూ పూజారి, ఆలకించిన ట్రంప్

కరోనా కష్టకాలంలో అమెరికా జాతీయ ప్రార్థనా దినోత్సవం నాడు వైట్ హౌజ్ అంతా హిందూ మంత్రాలతో మార్మోగిపోయింది. హిందూ ఆచారి పండిట్ హరీష్ బ్రహ్మబట్ట యజుర్వేదంలో శాంతి మంత్రాన్ని అక్కడ పఠించారు. 

Hindu priest recites Shanti Mantra in White house on National Day of Prayer

అమెరికా జాతీయ ప్రార్థనా దినోత్సవం నాడు వైట్ హౌజ్ అంతా హిందూ మంత్రాలతో మార్మోగిపోయింది. హిందూ ఆచారి పండిట్ హరీష్ బ్రహ్మబట్ట యజుర్వేదంలో శాంతి మంత్రాన్ని అక్కడ పఠించారు. 

ఈ కరోనా కష్టకాలంలో లాక్ డౌన్, భౌతిక దూరాన్ని పాటించడం వంటి కఠినమైన చర్యల వల్ల ప్రజలు ఆవేదనకు గురయ్యే ఆస్కారముందని, అందుకోసం యజుర్వేదం లోని ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తున్నట్టు, ప్రజలందరూ హాయిగా ప్రశాంతంగా ఉండడానికి ఇది ఎంతో ఉపయుక్తకరమని ఈ సందర్భంగా ఆ పండితుడు చెప్పాడు. 

ఆయన ఈ యజుర్వేదంలో శాంతి మంత్రాన్ని పఠించేటప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలినియా ట్రంప్ అక్కడే ఉన్నారు. ఈ సంస్కృతంలోని శాంతి మంత్రాన్ని పఠించిన తరువాత దాని ఇంగ్లీష్ అర్థాన్ని కూడా వారికి వివరించారు. 

అన్ని మతాలకు చెందిన పండితులు, మత ప్రచారకులు ఈ జాతీయ ప్రార్థనా దినోత్సవం నాడు వైట్ హౌజ్ లో సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ కరోనా కష్టకాలం నుంచి ప్రపంచం త్వరగా బయటపడాలని అందరూ ఈ సందర్భంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.  

ప్రతిసంవత్సరం మే నెలలోని మొదటి గురువారం నాడు అమెరికాలో ఇలా జాతీయ ప్రార్థనా దినోత్సవాన్ని నివహిస్తారు. ఈ ఈ సారి ప్రార్థనదినోత్సవాన్ని ఈ కరోనా కష్టకాలంలో నిర్వహించుకోవాలిసి వచ్చిందని పలువురు అమెరికన్లు విచారం వ్యక్తం చేసారు. 

ఇకపోతే.... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పర్సనల్ సెక్రటరీ కరోనా పాజిటివ్ గా తేలాడు. వెంటనే ఇవాంకా ట్రంప్ కి, ఆమె భర్త కుష్ణర్ కి కూడా పరీక్షలను నిర్వహించారు. వారికి కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

ఇవాంక పర్సనల్ సెక్రటరీ గత కొన్ని వారాలుగా ఆమె కు దూరంగానే ఉంటున్నాడు. అతడు తన ఇంటినుండి కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు ఇవాంక ట్రంప్ ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios