కిమ్, ట్రంప్.. లంచ్ మెనూ ఇదే..

కిమ్, ట్రంప్.. లంచ్ మెనూ ఇదే..

ఎంతో కాలంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ల భేటీ సింగపూర్ లో జరిగింది. దాదాపు 38 నిమిషాల పాటు భేటీ జరిగిన అనంతరం.. వీరిద్దరూ లంచ్ చేశారు. అయితే.. ఈ లంచ్ లో వాళ్లు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారో  ఇప్పుడు చూద్దాం..

మీటింగ్ అనంతరం ఇరు దేశాధినేతలు.. లంచ్ కి వెళ్తుండగా ట్రంప్ జోక్  వేసినట్లు సమాచారం. ఒక ఫోటో గ్రాఫర్ వారి ఇరువురుని ఫోటో తీస్తానని కోరడంతో.. తనను అందంగా తీయాలంటూ ట్రంప్ ఛలోక్తి విసిరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వుల పువ్వలు పూశాయి. అనంతరం లంచ్ చేసే ప్రదేశానికి వెళ్లారు. 

తెల్లటి పెద్ద డైనింగ్ టేబుల్ ని వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ టేబుల్ పై వైట్ అండ్ గ్రీన్ కలర్స్ గల పూలతో అందంగా అలంకరించారు. ఇద్దరు నేతలు ఎదురెదురుగా కూర్చొని లంచ్ ఆరగించారు.

వారి లంచ్ మెనూ..

స్టార్టర్స్ లో.. 
1. ప్రాన్ కాక్ టైల్ విత్ అవకాడో సలాడ్
2. తేనె, నిమ్మ కాయలతో డెకరేట్ చేసిన గ్రీన్ మ్యాంగో కీరాబు, తాజా ఆక్టోపస్
3.ఓయ్ సియోన్ ( కొరియన్ స్టఫ్డ్ కుకుంబర్)

మొయిన్ కోర్సు..

గొడ్డు మాంసం, పొటాటో డువాఫినాయిస్, స్ట్రీమ్ బ్రకోలిని, రెడ్ వైన్ సాస్
 తీపి, పులుపు కాంబినేషన్ లో పంది మాంసం, ఫ్రైడ్ రైస్ విత్ హోమ్ మేడ్ చిల్లీ సాస్

డిసర్ట్స్..

డార్క్ చాక్లెట్  టార్ట్ లెట్ గనాచీ
హాజెన్ డాజెస్ వెనీలా ఐస్ క్రీమ్ విత్ చెర్రీస్
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM INTERNATIONAL

Next page