నేపాల్‌లో ఓ హెలికాప్టర్ మిస్సింగ్ అయింది. ఆ హెలికాప్టర్‌లో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు.
నేపాల్‌లో ఓ హెలికాప్టర్ మిస్సింగ్ అయింది. ఆ హెలికాప్టర్‌లో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో ఐదుగురు విదేశీయులు ఉన్నారు. కనిపించిపోయిన హెలికాప్టర్ మనంగ్ ఎయిర్ సంస్థకు చెంది. అది సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు వెళ్తున్న ఈ హెలికాప్టర్ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో కంట్రోల్ టవర్‌తో డిస్‌కనెక్ట్ అయిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం హెలికాప్టర్‌తో కాంటాక్ట్ నెలకొల్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
సోలుకుంబులోని సుర్కి నుంచి ఖాట్మాండ్‌కు మంగళవారం ఉదయం 9:45 గంటలకు హెలికాప్టర్ బయలుదేరిందని నేపాల్ పౌర విమానయాన అథారిటీ సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ తెలిపారు. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ జనరల్ మేనేజర్ ప్రతాప్ బాబు తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. 9N-AMV అనే కాల్ సైన్ ఉన్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకు గ్రౌండ్‌తో కాంటాక్ట్ కోల్పోయింది. ఈ మేరకు ఖాట్మాండ్ పోస్టు రిపోర్ట్ చేసింది ఇక, కనిపించుకుండా పోయిన హెలికాప్టర్‌లోని ఆరుగురిలో.. కెప్టెన్ చెట్ బహదూర్ గురుంగ్ కూడా ఉన్నారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
