సారాంశం

 దానిని నెమ్మదిగా ఫుడ్ తినిపిస్తూ, ఆ ఫుడ్ కోసం అది అక్కడి నుంచి కదిలేలా చేశాడు. అది అక్కడ వాతావరణానికి అలవాటై, ఫ్రీ అవ్వగానే దానికి అందించాల్సిన ట్రీట్మెంట్ అందించాడు.

డాక్టర్ల దగ్గరకు రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. అందరూ బుద్దిగా ట్రీట్మెంట్ చేయించుకోకపోవచ్చు. వారికి ట్రీట్మెంట్ చేయించడానికి ఓపిక చాలా అవసరం. ముఖ్యంగా పిల్లల డాక్టర్స్ కి, వెట్ డాక్టర్స్ కి మరింత ఓపిక అవసరం. పిల్లలకు, పెంపుడు జంతువులకు వైద్యం చేయడం అంత సులభం కాదు. పిల్లలు మారం చేస్తున్నారు. ఇక పెంపుడు జంతువులు అంత తొందరగా ఎవరిమాట వినవు. అందుకే వారితో స్నేహం చేసి, ఆ తర్వాత వైద్యం చేస్తుంటారు కొందరు వైద్యులు. ఈ కింది వీడియోలో డాక్టర్ కూడా అంతే, ఓ కుక్కకు ట్రీట్మెంట్ చేయడం కోసం దానిని ఎలా మచ్చిక చేసుకున్నాడో మీరు ఈ వీడియోలో చూడొచ్చు.

 

అదొక పెంపుడు కుక్క. ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరకు తీసుకువచ్చారు. అయితే. ఆ కుక్క భయపడి కనీసం ఒక్క అడుగు కూడా ముందకు వేయలేదు. దీంతో ఆ డాక్టర్ దానితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. దానిని నెమ్మదిగా ఫుడ్ తినిపిస్తూ, ఆ ఫుడ్ కోసం అది అక్కడి నుంచి కదిలేలా చేశాడు. అది అక్కడ వాతావరణానికి అలవాటై, ఫ్రీ అవ్వగానే దానికి అందించాల్సిన ట్రీట్మెంట్ అందించాడు.

అయితే, డాక్టర్ సున్నితంగా పాట్స్ ఇవ్వడానికి తన సమయాన్ని తీసుకుంటాడు. అతను కుక్కను కౌగిలించుకొని దానికి కొన్ని ట్రీట్‌లు ఇచ్చాడు. డాక్టర్ కౌగిలించుకోవడంతో కుక్క భయం పోయి, శాంతపడుతుంది. తర్వాత ఆ డాక్టర్ ఒడిలో కూడా ఆ కుక్క కూర్చోవడం గమనార్హం. ఈ వీడియోకి ఇప్పటి వరకు 9.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇక కామెంట్ల వర్షం కొనసాగుతోంది. ఆ డాక్టర్ ఓపికకు, ట్రీట్మెంట్ చేసిన విధానానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.