జాగింగ్ లో గుండెపోటు.. కంపెనీ సీఈవో ప్రాణం కాపాడిన స్మార్ట్‌వాచ్..
మామూలుగా ఉదయం 7 గంటలకు మార్నింగ్ జాగింగ్ కోసం వెళ్ళాను, ఐదు నిమిషాలలో ఛాతీలో విపరీతమైన నొప్పి అనిపించింది.. నా ఛాతీ బిగుతుగా అనిపించింది. ఒక్క సెకన్ తరువాత నేను రోడ్డుపై చేతులు, మోకాళ్లపై ఆనుకుని ఉన్నాను.

లండన్ : స్మార్ట్ వాచ్ ఉపయోగాల్లో మరొకటి కూడా చేరింది. స్మార్ట్ వాచ్ ఇప్పుడు ప్రాణాలు కాపాడే పని కూడా చేస్తుంది. ఈ స్టోరీ పూర్తిగా చదివితే మీరూ దీన్ని అంగీకరిస్తారు. యూకేలో ఓ 42 ఏళ్ల వ్యక్తి గుండెపోటు నుండి బయటపడటానికి స్మార్ట్ వాచ్ ఎలా సహాయపడిందో తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. యూకేలోని హాకీ వేల్స్ సంస్థ సీఈవో అయిన పాల్ వాపమ్, స్వాన్సీలోని మోరిస్టన్ ప్రాంతంలోని తన ఇంటి దగ్గర ఉదయం జాగింగ్ కు వెళ్లాడు.
రన్నింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే ఏం చేయాలో పాలు పోలేదు. ఓ వైపు నొప్పితో ఆలోచన రావడం లేదు. కానీ ఆ సమయంలో అతను ఎలాగో తన వాచ్ ద్వారా భార్యకు విషయం చేరవేశాడు. వెంటనే ఆమె భర్త దగ్గరికి చేరుకుని, అతన్ని ఆసుపత్రికి తరలించింది. ప్రమాదం నుంచి బయటపడిన తరువాత వేల్స్ మాట్లాడుతూ.. "నేను మామూలుగా ఉదయం 7 గంటలకు మార్నింగ్ జాగింగ్ కోసం వెళ్ళాను, ఐదు నిమిషాలలో నాకు ఛాతీలో విపరీతమైన నొప్పి అనిపించింది.. నా ఛాతీ బిగుతుగా అనిపించింది.
పోర్చుగల్ ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా రాజీనామా.. కారణం ఇదే...
ఒక్క సెకన్ తరువాతనేను రోడ్డుపై చేతులు, మోకాళ్లపై ఆనుకుని ఉన్నాను. మొదట్లో కాస్త బిగుతుగా ఉన్నా ఆ తర్వాత ఛాతిలో పిండినట్లు అనిపించింది. నొప్పి నమ్మశక్యంగా లేదు. దీంతో వెంటనే నేను నా భార్య లారాకు ఫోన్ చేయడానికి నా వాచ్‌ని ఉపయోగించగలిగాను. అదృష్టవశాత్తూ, నేను కేవలం ఐదు నిమిషాల దూరంలో ఉన్నాను, కాబట్టి ఆమె నన్ను కారులో ఆసుపత్రికి తీసుకెళ్లగలదు' అన్నారాయన.
ఒక వాల్వ్ మూసుకుపోవడం వల్ల అతనికి గుండెపోటు వచ్చినట్లు తేలింది. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రి కార్డియాక్ సెంటర్‌లోని కాథెటరైజేషన్ లేబొరేటరీలో చికిత్స చేశారు. ఆరు రోజుల తరువాత కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని వాపమ్ అన్నారు.
''నేను అధిక బరువు లేను. నన్ను నేను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి గుండెపోటుకు అవకాశం ఉన్న ఎటువంటి ప్రమాద కారకాలు లేవని నాకు తెలుసు. అందుకే ఇది కొంచెం షాక్‌గా ఉంది. ఇది నిజంగా నా కుటుంబంతో సహా అందరికీ షాక్ కి గురిచేసిందని అన్నారు.
స్మార్ట్‌వాచ్‌లు చాలా సందర్భాలలో జీవితాలను కాపాడతాయని నిరూపితమయ్యింది. హృదయ స్పందన రేటు, ఈసీజీ, మరిన్నింటిని కొలిచే సెన్సార్‌లను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల ఆరోగ్యంలో అసాధారణతలను గుర్తించడం ద్వారా ఇది ప్రాణాలను ఎలా కాపాడిందనే దాని గురించి అనేక సంఘటనలు ఉన్నాయి.