అమెరికాలోని హవాయ్ దీవుల్లో ప్రమాదవశాత్తు ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్ లోని ఏడుగురు గల్లంతయ్యారు. హవాయ్ దీవి పరిధిలోని కవాయ్ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆరుగురు ప్రయాణికులు ఓ పైలెట్ తో కలిసి హెలికాప్టరులో బయలుదేరారు. అయితే.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హెలికాప్టర్ కుప్పకూలింది.

ఈ హెలికాప్టరులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. కవాయ్ దీవుల సందర్శనకు వెళ్లిన హెలికాప్టరు తిరిగి రాలేదు. దీంతో కవాయ్ పోలీసులు జాడ లేకుండా పోయిన హెలికాప్టరుతోపాటు అందులోని ప్రయాణికుల కోసం గాలింపు చేపట్టారు. కవాయ్ దీవిలోని నులాలో సమీపంలోని కోకీ వద్ద హెలికాప్టరు కూలిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. 

హెలికాప్టరులో ఉన్న ప్రయాణికులు ఏమయ్యారు? ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారా? లేదా ? అనేది కవాయ్ పోలీసులు గాలిస్తున్నారు. హెలికాప్టరులోని ప్రయాణికుల జాడ ఇంకా తెలియలేదని కవాయ్ పోలీసులు చెప్పారు.