ఇజ్రాయెలీపై దాడికి నాయకత్వం వహించిన హమాస్ కమాండర్ హతం: ఇజ్రాయెల్ మిలిటరీ

అక్టోబర్ 7వ తేదీన వందలాది మంది ఇజ్రాయెలీ పౌరులను పొట్టనబెట్టుకున్న మెరుపుదాడికి సారథ్యం వహించిన అలీ ఖాదిని హతమార్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
 

hamas terrorist ali qadi killed says israel military kms

న్యూఢిల్లీ: ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ శనివారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు దాటి లోనికి చొచ్చుకువచ్చి హమాస్ సాయుధులు మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో కొన్ని వందల మంది ఇజ్రాయెలీలు మరణించారు. హమాస్‌కు చెందిన నక్బా అనే యూనిట్ ఈ దారుణానికి పాల్పడింది. ఈ దాడికి పాల్పడిన నక్బా యూనిట్‌కు నేతృత్వం వహించిన అలీ ఖాదీని హతమార్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ వేదికగా ఈ ప్రకటన చేసింది. ఐడీఎఫ్, ఐఎస్ఏ ఇంటెలిజెన్స్ ప్రకారం తమ విమనం అలీ ఖాదిని చంపేసిందని వివరించింది. నక్బా కమాండో ఫోర్స్ కమాండర్ అలీ ఖాది సారథ్యంలోనే ఇజ్రాయెలీలపై గతవారంతంలో మారణహోమం జరిగిందని పేర్కొంది.

ఇజ్రాయెలీ పౌరుల హత్య, అపహరణల తర్వాత అలీని 2005లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. గిలాడ్ షాలిత్ ప్రిజనర్ ఎక్స్‌చేంజ్‌లో భాగంగా ఖాదిని వారికి అప్పగించాల్సి వచ్చిందని పేర్కొంది. ఇదే వార్తను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫఓర్స్ (ఐడీఎఫ్) కూడా ధ్రువీకరించింది.

Also Read: సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అయ్యే వారికి రూ. 7, 500 స్టైపండ్ అందిస్తాం: తమిళ నాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్

అక్టోబర్ 7వ తేదీన అనాగరికంగా ఇజ్రాయెలీ పౌరులను పొట్టనబెట్టుకున్న దారుణం అలీ ఖాది సారథ్యంలో నే జరిగిందని, తాము అలీ ఖాదిని చంపేశామని వెల్లడించింది. హమాస్ టెర్రరిస్టులు అందరికీ ఇదే తలరాత ఉంటుందని పేర్కొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios