Israel Hamas war: హమాస్ బందీలో ఇజ్రాయెల్ మహిళలు.. యూఎన్ ఆదేశాల మేరకు వీడియో విడుదల..
Israel Hamas war:పాలస్తీనాకు చెందిన హమాస్, ఇజ్రాయిల్(Israel) మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా గాజాలో ముగ్గురు ఇజ్రాయెల్ మహిళలను బందీలుగా ఉంచినట్లు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ శుక్రవారం వీడియోను విడుదల చేసింది.
Israel Hamas war: పాలస్తీనాకు చెందిన హమాస్, ఇజ్రాయిల్(Israel) మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. తాజాగా గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌లో ముగ్గురు మహిళల వీడియోను హమాస్ శుక్రవారం విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడిలో ఈ ముగ్గురు ఇజ్రాయెల్ మహిళలను ఇజ్రాయెల్ బందీలుగా చేసుకుంది. వారికి సంబంధించిన వీడియోను హమాస్ విడుదల చేసింది. ఈ ఐదు నిమిషాల వీడియోలో ఒక మహిళ తనను తాను ఇజ్రాయెల్ సాధారణ పౌరుడిగా అభివర్ణించగా, ఇద్దరు మహిళలు తమను తాము ఇజ్రాయెల్ సైనికులుగా తెలిపారు.
ఐదు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో హమాస్ చెరలో బందీగా ఉన్న మహిళలు మాట్లాడుతూ.. ఒక మహిళ తనను తాను ఇజ్రాయెల్ సాధారణ పౌరుడిగా అభివర్ణించగా, ఇద్దరు మహిళలు తమను తాము ఇజ్రాయెల్ సైనికులుగా తెలిపారు. గత 107 రోజులుగా తాము హమాస్ వద్ద బందీలుగా ఉన్నట్లు మహిళ పేర్కొంది.
బందీల విడుదల కోసం గాజాలో ఇజ్రాయెల్ తీవ్ర దాడులు చేస్తోందని తమకు తెలిసిందని, అయితే, భద్రతా కారణాలు, సైనిక వైఫల్యం కారణంగా తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత హమాస్ చెరలోని తమను విడిపించాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గాజాలో మారణహోమ చర్యలను నిరోధించేందుకు ఇజ్రాయెల్ చేయగలిగినదంతా చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
వాస్తవానికి ఐక్యరాజ్య సమితి యొక్క అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తర్వాత ఈ వీడియో విడుదలైంది. అక్టోబర్ 7 దాడి సమయంలో అపహరణకు గురైన బందీలను తక్షణమే, షరతులు లేకుండా విడుదల చేయాలని కోర్టు పిలుపునిచ్చింది. హమాస్ దాడి ఫలితంగా అక్టోబర్ 7 ఇజ్రాయెల్‌లో దాదాపు 1,140 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు.
అధికారిక ఇజ్రాయెల్ గణాంకాల ఆధారంగా.. మిలిటెంట్లు దాదాపు 250 మంది బందీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిలో 132 మంది గాజాలో ఉన్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. ఇందులో కనీసం 28 మంది చనిపోయారని పేర్కొంది. హమాస్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడులలో కనీసం 26,083 మంది పాలస్తీనియన్లు, వారిలో 70 శాతం మంది మహిళలు, చిన్నపిల్లలు, యుక్తవయస్కులు మరణించారని పేర్కొంది.