Ismail Haniyeh: మిడిల్ ఈస్ట్ సంక్షోభం: ఇరాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హతం
Hamas leader Ismail Haniyeh killed in Iran: టెహ్రాన్‌లోని హమాస్ కార్యాలయంపై జరిగిన దాడిలో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే హతమైనట్లు ఇరాన్ పారామిలిటరీ ప్రకటించింది.
Hamas leader Ismail Haniyeh killed in Iran: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని హమాస్ కార్యాలయంపై జరిగిన దాడిలో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే హతమైనట్లు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఇదే విషయాన్ని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కూడా ప్రకటించింది. హనియెహ్ మరణానికి సంతాపం తెలిపింది. అతను ‘‘టెహ్రాన్‌లోని అతని నివాసంపై ద్రోహపూరిత జియోనిస్ట్ దాడిలో’’ హతమయ్యాడని పేర్కొంది.
టెహ్రాన్‌లోని నివాసంపై జియోనిస్ట్ దాడిలో హతమైన హనియే మృతికి ఇస్లామిక్ వర్గం సంతాపం తెలిపింది.
అంతకుముందు ఇరాన్ బాడీగార్డుతో కలిసి ఆయన నివాసంపై దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఆయన ఇరాన్ వెళ్లినట్లు వెల్లడించింది. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.
మిలిటెంట్ గ్రూపు బహిష్కరణకు గురైన పొలిటికల్ చీఫ్ అయిన హనియే ఇటీవలి కాలంలో ఎక్కువ సమయం ఖతార్‌లోనే గడిపారు. ఇజ్రాయెల్- గాజా యుద్ధ సమయంలో కాల్పుల విరమణ చర్చల్లో సంధానకర్తగా వ్యవహరించి... హమాస్ ప్రధాన మిత్రదేశమైన ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
స్పందించని ఇజ్రాయిల్...
అయితే, ప్రస్తుతానికి హనియే హత్యకు బాధ్యులెవరనేది తేలలేదు. ఇజ్రాయెల్ హత్య చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా ఇజ్రాయిల్ అధికారికంగా స్పందించలేదు. కాగా, హమాస్ నాయకులను హతమారుస్తామని ఇజ్రాయెల్ గతంలో ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.