ఇజ్రాయెల్ స్థావరంపై దాడికి సంబంధించిన కొత్త వీడియోను విడుదల చేసిన హమాస్...
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ విడుదల చేసిన ఓ వీడియో కలకలం రేపుతోంది. అక్టోబర్ 7న జరిగిన దాడికి సంబంధించిన వీడియో అది.
గాజా : పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ అక్టోబర్ 7 దాడికి సంబంధించి తాజాగా ఓ షాకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇజ్రాయెల్ మిలిటరీ సైట్‌పై తమ యోధులు దాడి చేస్తున్న వీడియో అది. ఈ వీడియోలో తమ సైన్యం ఇజ్రాయెల్ మిలిటరీ సైట్ పై దాడి చేస్తున్న దృశ్యాలున్నాయని హమాస్ పేర్కొంది. కిస్సుఫిమ్ బెటాలియన్ సాయుధ మద్దతు సైట్‌పై దాడిని ఈ ఫుటేజీలో చూపించింది.
ఖాన్ యునిస్‌కు తూర్పున ఉన్న సైనిక శిబిరంలోని ఇజ్రాయెలీలను చంపేశారు. మరికొంతందిని బంధించారు, ఇజ్రాయెల్‌పై 'అల్ అక్సా ఫ్లడ్' ఆపరేషన్‌లో ఈ దాడి భాగమని హమాస్ పేర్కొంది. పాలస్తీనాలో హమాస్ నరమేథం సృష్టిస్తోంది. ఇజ్రాయెలీలను బంధించి, ఒక దగ్గరికి చేర్చి టైర్లు, పెట్రోలు వేసి సజీవదహనం చేస్తోంది.
దీనిమీద ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నేతాన్యాహూ మాట్లాడుతూ కంటనీరు పెట్టుకున్నారు. ఇంతటి దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రతీ హమాస్ వ్యక్తి మృతుడుగానే గుర్తించాలన్నారు. ఈ నరమేధాన్ని ఆపడానికి తమ వంతు కృషి చేస్తున్నామని.. ప్రపంచదేశాలు మద్దతు ఇవ్వాలని కోరారు.
మరోవైపు హమాస్ చెరలో ఉన్న బందీలను సురక్షితంగా ఇజ్రాయెల్ కు వచ్చేదాకా గాజా స్ట్రిప్ కు విద్యుత్, తాగునీరు, ఇంధన సరఫరాలు జరగవని ఇజ్రాయల్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. పాలస్తీనాలోని ఏకైక పవర్ ప్లాంట్ కూడా బుధవారం ఆగిపోయింది. హమాస్ ఇజ్రాయెల్ పై మెరుపుదాడి చేసి 150మంది పౌరులను బంధించింది.