Asianet News TeluguAsianet News Telugu

మసీదు వద్ద ఆగంతకుడి కాల్పులు: 15 మంది మృతి

వీకెండ్ సాయంత్రం ఈ కాల్పుల సంఘటన కలకలం రేపింది. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారంగా కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని ఇంకా గుర్తుపట్టలేదని, కానీ అతను గోరోం వాసిగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.

gunman opens fire near a mosque: 15 dead
Author
Ouagadougou, First Published Oct 13, 2019, 7:30 AM IST

వాగాగా : విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఒక వ్యక్తి 15మంది నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. బుర్కినా ఫాసో దేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక సాయుధుడైన వ్యక్తి మార్కెట్లు రద్దీగా ఉండే సాయంత్రంపూట ఈ దారుణానికి ఒడిగట్టాడు. 

వివరాల్లోకి వెళితే, పశ్చిమ ఆఫ్రికాలో భూపరివేష్టిత దేశమైన బుర్కినా ఫాసో లో వీకెండ్ సాయంత్రం ఈ కాల్పుల సంఘటన కలకలం రేపింది. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారంగా కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని ఇంకా గుర్తుపట్టలేదని, కానీ అతను గోరోం వాసిగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. 

ఈ కాల్పుల్లో 15మంది చనిపోయారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మసీదు ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ కాల్పులకు అతడు తెగబడ్డాడు. 

ప్రశాంతంగా ఉండే బుర్కినా ఫాసో సంవత్సర కాలంగా మత విద్వేషాలు, తీవ్రవాద దుశ్చర్యలవల్ల అట్టుడుకుతోంది. పక్కనున్న మాలి, నైజర్ ల నుంచి తీవ్రవాదం ఈ దేశంలోకి కూడా దిగుమతయ్యి ఇప్పుడు మహమ్మారిలా పట్టిపీడిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios