భార్య సహా ఐదుగురిని కాల్చి చంపి తాను ఆత్మహత్య

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 13, Sep 2018, 10:31 AM IST
Gunman Kills 5 In California Before Shooting Himself
Highlights

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. గుర్తు తెలియని సాయుధుడు ఐదుగురి కాల్చి చంపి, తాను కాల్చుకుని మరణించాడు. దక్షిణ కాలిఫోర్నియాలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

కాలిఫోర్నియా: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. గుర్తు తెలియని సాయుధుడు ఐదుగురి కాల్చి చంపి, తాను కాల్చుకుని మరణించాడు. దక్షిణ కాలిఫోర్నియాలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. 

కాలిఫోర్నియాలోని బేకర్స్ ఫీల్డ్ లో గల ట్రకింగ్ కంపెనీలో తన భార్యను, మరో వ్యక్తిని సాయుధుడు కాల్చి చంపాడు. మరో వ్యక్తిని ట్రకింగ్ కంపెనీ నుంచి వెంటాడి సమీపంలోని స్పోర్ట్స్ స్టోర్ వద్ద కాల్చి చంపాడు. 

ఆ తర్వాత ఓ ఇంటి సమీపంలో ఇద్దరిని కాల్చి చంపాడు. ఆ తర్వాత ఓ మహిళ, ఆమె చిన్నారి నుంచి వాహనాన్ని లాక్కుని తీసుకుని వెళ్లి ఆ తర్వాత తనను తాను కాల్చుకుని మరణించాడు. అయితే, ఆ మహిళకు, చిన్నారికి అతను ఏ విధమైన హాని తలపెట్టలేదు.

ఎందుకు అతను ఈ కాల్పులు జరిపి వారిని చంపాడనే విషయంపై అధికార వర్గాలు ఆరా తీస్తున్నాయి.  విచక్షణారహితమైన కాల్పులు జరపకుండా ఎంపిక చేసుకుని అతను వారిని ఎందుకు చంపాడనేది మిస్టరీగానే ఉంది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఓ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు.

loader