అమెరికాలో కల్పులు బీభత్సం జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలో ఆదివారం తెల్లవారు జామున 02.30 గంటలకు (స్థానిక కాలమానం) ఓ ఆటోమేటిక్ గన్‌తో ప్రజలపై కాల్పులు జరుపుతూ విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 15 మంది బుల్లెట్‌లను ఎదుర్కొన్నారని, ఇందులో ఆరుగురు మరణించారని పోలీసు అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: అమెరికాలో మరోసారి కాల్పులు బీభత్సం జరిగింది. కాలిఫోర్నియాలో రద్దీగా ఉండే శాక్రమెంటో ఏరియాలో ఆటోమేటిక్ గన్‌తో కాల్పులు జరిపి రక్తపాతాన్ని సృష్టించారు. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో జరిగిన ఈ కాల్పుల్లో కనీసం ఆరుగురు దుర్మరణం చెందినట్టు అధికారులు తెలిపారు. కాగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్టు చెప్పారు. ఈ ఘటన 10వ, కే వీధుల మూలములుపులో ఆదివారం తెల్లవారు జామున 2.30 గంటలకు (09.30 జీఎంటీ) చోటుచేసుకుంది.
శాక్రమెంటోలో కాల్పులు జరిపిన సమయంలో చాలా మంది ఉన్నారు. రెస్టారెంట్లు, బార్లలో ఎక్కువ మంది ఉన్నారు. వారిపైనే ఓ ఆటోమేటిక్ గన్‌తో కాల్పులు జరిగాయి. అయితే, ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. ఘటన జరగ్గానే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్షణాల్లో అంబులెన్స్‌లు స్పాట్‌కు చేరుకున్నాయి.
కాల్పులు జరగ్గానే పోలీసులు వెంటనే స్థానికంగా అలర్ట్ చేశారు. 9వ వీధి నుంచి 13వ వీధి మధ్య ఏరియాను క్లోజ్ చేసింది. ఈ ఏరియాల్లో పోలీసులు బలగాలు పెద్ద మొత్తంలో ఉంటాయని, ఈ ఏరియాలోకి రావొద్దని ప్రజలను పోలీసులు కోరారు. అంతేకాదు, ఈ ప్రాంతం ఇంకా యాక్టివ్‌గానే ఉన్నదని తెలిపారు.
కాల్పులు జరిపిన ప్రాంతం కీలక వేదికలకు సమీపంలో ఉన్నది. శాక్రమెంటో కింగ్స్ బాస్కెట్ బాల్ ఆడే మైదానం గోల్డెన్ వన్ సెంటర్‌కు ఈ దారి వెళ్తుంది. దేశ క్యాపిటల్ బిల్డింగ్‌కు మరికొన్ని వీధులకు దూరంలోనే ఈ ఘటన జరిగింది.
కమ్యూనిటీ యాక్టివిస్ట్ బ్యారీ ఆసియస్ ఘటనా స్థలికి చేరుకుని దిగ్భ్రాంతి చెందారు. తెల్లవారుజామున 02.30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు వివరించారు. ఇది చాలా దిగ్భ్రాంతికర ఘటన అని తెలిపారు. తాను ఆ ప్రాంతం గుండా వెళ్తుండగా హృదయ విదారక దృశ్యాలు కనిపించాయని పేర్కొన్నారు. చాలా మంది బాధితులు రక్తంతో తడిసిపోయి ఉన్నారని వివరించారు. అరుపులు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగుతున్నదని చెప్పారు. నా సోదరుడు ఎక్కడా? అంటూ ఒకరు.. బిడ్డ కోసం తల్లి ఏడుస్తూ వెతుకుతున్న ఘటనలు చూశానని వివరించారు.
americaలో మార్చి 7వ తేదీన కాల్పుల కలకలం చెలరేగింది. Iowa school బయటి నుంచి వెడుతున్న వాహనంలో నుంచి కాల్పులు జరగడంతో ఒకరు మరణించారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాపిటొల్ నుండి అర మైలు దూరంలో ఉన్న డెస్ మోయిన్స్ డౌన్‌టౌన్ సమీపంలోని ఈస్ట్ హై స్కూల్ మైదానంలో జరిగిన ఈ కాల్పుల్లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు డెస్ మోయిన్స్ పోలీసులు ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. అయితే వీరిమీద ఇప్పటివరకు ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని తెలిపారు.
