ఉక్రెయిన్‌కు సాయం చేయాలని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelensky) ప్రపంచ దేశాలను కోరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా Grammy Awards 2022 వేదికగా కూడా ఉక్రెయిన్‌కు సాయం చేయాల్సిందిగా జెలెన్ స్కీ అభ్యర్థించారు. 

ఉక్రెయిన్‌కు సాయం చేయాలని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelensky) ప్రపంచ దేశాలను కోరుతున్న సంగతి తెలిసిందే. తమ దేశంపై రష్యా దాడిని ఖండించాలని.. తమకు మద్దుతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే తాజాగా Grammy Awards 2022 వేదికగా కూడా ఉక్రెయిన్‌కు సాయం చేయాల్సిందిగా జెలెన్ స్కీ అభ్యర్థించారు. ఈ మేరకు గ్రామీ అవార్డ్స్ 2022 వేడుకలో జెలెన్ స్కీ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. అందులో ఉక్రేనియన్లకు మీరు చేయగలిగిన విధంగా మద్దతు ఇవ్వాలని జెలెన్ స్కీ వీక్షకులకు విజ్ఞప్తి చేశారు.

అమెరికన్ గాయకుడు-గేయరచయిత జాన్ లెజెండ్, ఉక్రేనియన్ కవి లియుబా యాకిమ్‌చుక్ ప్రదర్శనకు ముందు ప్రసారం చేసిన జెలెన్ స్కీ వీడియోను ప్రసారం చేశారు. ‘‘సంగీతానికి విరుద్ధమైనది ఏమిటి?.. శిథిలమైన నగరాలు, ప్రజలను చంపిన నిశ్శబ్దం’’ అని జెలెన్ స్కీ పేర్కొన్నారు. 

‘‘నిశ్శబ్దాన్ని మీ సంగీతంతో పూరించండి. మా కథను చెప్పడం ఈ రోజే ప్రారంభించండి. మీరు చేయగలిగిన విధంగా మాకు మద్దతు ఇవ్వండి. ఏదైనా.. కానీ నిశ్శబ్దం వద్దు’’ అని జెలెస్కీ కోరారు. ఇక, ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడిని పిల్లలతో సహా, ప్రజల కలలను, జీవితాలను నాశనం చేయడానికి బెదిరించే భీకరమైన నిశ్శబ్దంతో పోల్చారు. 

‘‘మన సంగీత విద్వాంసులు టక్సేడోలకు(సూట్‌) బదులుగా శరీర కవచాన్ని ధరిస్తారు. వారు ఆసుపత్రులలో గాయపడిన వారికి, వినలేని వారికి కూడా పాడతారు" అని జెలెన్ స్కీ చెప్పారు. కానీ సంగీతం ఎలాగైనా విరుచుకుపడుతుంది అని అన్నారు. 

ఇక, నెల రోజులకు పైగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కొసాగిస్తుంది. ఉక్రెయిన్ బలగాలు కూడా కొన్ని చోట్ల రష్యాల బలగాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తున్న చైనా.. లక్షలాది మంది పౌరులు అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసింది. రష్యాల దాడుల నేపథ్యంలో అనేక నగరాలు శిథిలాలే దర్శనమిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో పౌరులు కూడా మృత్యువాతపడుతున్నారు. చాలా చోట్ల భయానక పరిస్థితులు ఉన్నట్టుగా ఉక్రెయిన్ చెబుతుతోంది. చైనా యుద్ద నేరానికి పాల్పడిందని ఆరోపిస్తుంది. మరోవైపు ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. యుద్దం ముగింపు దిశగా అడుగులు పడటం లేదు.