శ్రీలంక అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్సే రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి సింగపూర్ కు చేరుకున్న అనంతరం తన రాజీనామా లేఖను స్పీకర్ మహీందా అభియవర్ధినేకు పంపినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.  

కాగా.. గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోవడంతో అక్కడ నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆయన శ్రీలంక నుంచి మాల్దీవులకు చేరుకున్న విషయం తెలియడంతో అక్కడ నివాసం ఉంటున్న శ్రీలంక వాసులు ఆందోళన నిర్వహించారు. మాల్దీవుల రాజధాని Maleలో శ్రీలంక జాతీయులు.. గోటబయకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దయచేసి క్రిమినల్స్‌కు రక్షణ కల్పించవద్దని కోరారు. 

ALso REad:Sri Lanka crisis: మాల్దీవుల నుంచి సింగపూర్‌కు గోటబయ రాజపక్స.. అందుకేనా..?

ఈ క్రమంలోనే మాల్దీవుల్లో ఉండటం సురక్షితం కాదని గోటబయ రాజపక్స భావించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లారు. గోటబయ రాజపక్స, అతని భార్య సౌదియా ఎయిర్‌లైన్స్ SV788 విమానంలో మాలే నుంచి సింగపూర్‌కు బయలుదేరినట్టుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు వారు సింగపూర్ చేరుకుంటారని తెలుస్తోంది. గోటబయ రాజపక్స ప్రస్తుతానికి సింగపూర్‌లోనే ఉంటారని శ్రీలంక ప్రభుత్వ వర్గాల సమాచారం