Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్ : ప్రాణాంతక క్యాన్సర్ కు మందు కనిపెట్టిన లండన్ శాస్త్రవేత్తలు...

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, 20 సంవత్సరాలలో ఈ వ్యాధి కోసం కనిపెట్టిన అద్భుతమైన చికిత్స విధానం ఇదే. 

Good news : London scientists have discovered a cure for deadly cancer - bsb
Author
First Published Feb 16, 2024, 10:07 AM IST

యూకే : యునైటెడ్ కింగ్‌డమ్‌లోని శాస్త్రవేత్తలు అత్యంత మొండి క్యాన్సర్ అయిన మెసోథెలియోమాను తగ్గించే అద్భుతమైన ఔషధాన్ని కనిపెట్టారు. ఈ క్యాన్సర్ ప్రపంచంలోనే అతి భయంకరమైన, చికిత్సకు లొంగని, వేగంగా వ్యాపించే క్యాన్సర్ రకం. ది గార్డియన్ ప్రకారం, క్వీన్ మేరీ యూనివర్శిటీ లండన్‌లోని పరిశోధకులు మెసోథెలియోమా వచ్చిన పేషంట్ల మనుగడ రేటును పెంచే చికిత్స విధానాన్ని కనిపెట్టారు. వారి సగటు జీవితకాలమైన మూడు సంవత్సరాల మనుగడ రేటును "నాలుగు రెట్లు పెంచుతుంది" అని సైంటిస్టులు తెలిపారు. 

ఇక దీనినుంచి కోలుకునే సర్వైవల్ రేటును 1.6 నెలలు పెంచింది. ఈ చికిత్స విధానంలో కణితికి ఆహార సరఫరాను నిలిపివేస్తారు. ఈ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కొత్త ఔషధం 20 సంవత్సరాలలో మెసోథెలియోమా క్యాన్సర్ కోసం కనిపెట్టిన మొదటి రకం మందు అని కూడా వారు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు JAMA ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌తో పులి: ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో

మెసోథెలియోమా అనేది ఒక రకమైన క్యాన్సర్, ఇది ఊపిరితిత్తులలో అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా ఆస్బెస్టాస్‌ ఉన్న పని ప్రాంతంలో పనిచేసేవారు ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడతారు. ఇది వేగంగా విస్తరిస్తుంది. ప్రాణాంతకమైన, ప్రపంచంలోని అతి మొండి, జీవితకాలాన్ని బాగా తగ్గించే క్యాన్సర్ లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, యూకేలో ప్రతి సంవత్సరం 2,700 కొత్త మెసోథెలియోమా కేసులు నమోదవుతున్నాయి. 

క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ లాంటి ఐదు దేశాలలో అంతర్జాతీయ ట్రయల్ నిర్వహించారు. ఈ పరిశోధనకు క్వీన్ మేరీ ప్రొఫెసర్ పీటర్ స్జ్లోసరెక్ నేతృత్వం వహించారు. ఈ బృందం రోగులందరికీ ప్రతి మూడు వారాలకు ఆరు రౌండ్ల కీమోథెరపీ అందేలా చూశారు. వీరిలో సగం మందికి కొత్త ఔషధం ADI-PEG20 (పెగార్గిమినేస్) ఇంజెక్ట్ చేశారు. మిగిలిన సగం మందికి రెండేళ్లపాటు ప్లేసిబో ఇచ్చారు.

ఈ పరిశోధనలో చేర్చబడిన రోగులలో ప్లూరల్ మెసోథెలియోమా చివరి దశలో ఉన్న 249 మంది రోగులు ఉన్నారు. వారిలో వ్యాధి ఊపిరితిత్తుల పొరను ప్రభావితం చేసింది. వీరి సగటు వయస్సు 70 సంవత్సరాలు.

ATOMIC-meso ట్రయల్ 2017, 2021 సం.ల మధ్య ఐదు దేశాలలో 43 కేంద్రాలలో నిర్వహించబడింది. అధ్యయనంలో పాల్గొన్న రోగులను కనీసం ఒక సంవత్సరం పాటు పరిశీలనలో ఉంచారు. అధ్యయనం ప్రకారం, ప్లేసిబో, కీమోథెరపీ ఇచ్చినవారి  7.7 నెలలతో సగటుతో పోలిస్తే... పెగార్గిమినేస్, కీమోథెరపీ ఇచ్చినవారు సగటున 9.3 నెలలు జీవించారు, 

ప్లేసిబో, కెమోథెరపీ చికిత్స అందిన రోగుల 5.6 నెలల జీవితకాలంతో పోలిస్తే... పెగార్గిమినేస్-కెమోథెరపీతో చికిత్స ఇచ్చిన రోగుల్లో వ్యాధి పెరగకపోవడంతో వారి జీవితకాలం 6.2 నెలలు ఉంటుందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, 20 సంవత్సరాలలో ఈ వ్యాధి కోసం అభివృద్ధి చేయబడిన క్యాన్సర్ జీవక్రియను లక్ష్యంగా చేసుకునే ఔషధంతో.. కీమోథెరపీని కలిపి చేసే చికిత్స ఇందులో మొదటి విజయవంతమైన కలయిక అని తెలిపారు. 

కొత్త ఔషధం రక్తప్రవాహంలో అర్జినైన్ స్థాయిలను తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. ఈ వ్యాధి బారిన పడినవారిలో శరీరం వారి స్వంత అర్జినైన్‌ను తయారు చేయలేని స్థితిలో ఉంటుంది. ఆర్జినైన్ కణితి కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios