Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్.. అక్కడ మద్యంపై నిషేదం..!

మాస్క్ ధరించకపోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తామంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. తాజా రూల్స్ ప్రకారం..మాస్క్ ధరించని వారికి ఏకంగా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 

Global report: South Africa bans alcohol sales; Spain sets up Covid vaccine register
Author
Hyderabad, First Published Dec 29, 2020, 11:55 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల సెకండ్ వేవ్ కూడా మొదలైంది. దీని ప్రభావం దక్షిణాఫ్రికాలో కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో.. దీనిని అరికట్టేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.

దీనిలో భాగంగానే..అక్కడి ప్రభుత్వం మరోమారు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. అంతేకాకుండా.. మాస్క్ ధరించకపోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తామంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. తాజా రూల్స్ ప్రకారం..మాస్క్ ధరించని వారికి ఏకంగా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 

‘కరోనా కట్టడి ఏర్పాట్లను మొదటి స్థాయి నుంచి మూడోస్థాయికి పెంచాం. ఈ నిబంధనలు ఈ అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి. అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా సోమవారం నాడు ప్రకటించారు. మూడో లెవెల్‌లో ఉన్న కొన్ని నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. కరోనా కట్టడి కోసం ఇది తప్పనిసరి అని సిరిల్ స్పష్టం చేశారు. కరోనా కట్టడి కోసం దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఐదు అంచెల(ఐదు లెవెల్స్) వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. అయితే... ఆర్థికవ్యవస్థను తెరిచే ఉంచడం, కరోనా నుంచి మనుషుల ప్రాణాలను కాపాడటం మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు సిరిల్ తెలిపారు. 

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఓ కొత్త రకం కరోనా స్ట్రెయిన్ విపరీతంగా వ్యాపిస్తోంది. దీని వల్ల యువత అధికంగా ప్రభావితమవుతున్నారు. ‘కరోనాపై జరుగుతున్న పోరాటంలో మనం అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకున్నాం. నిన్న(ఆదివారం) మొత్తం కరోనా కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటింది’ అని అధ్యక్షుడు సిరిల్ తెలిపారు. ‘కొత్త ఏడాది వేడుకలు, బంధుమిత్రులతో జరుపుకునే ఫంక్షన్ల కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనాపై పోరాటంలో మనం రక్షణాత్మక ధోరణికి పక్కన పెట్టి రిలాక్స్ అయ్యాం.. ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం’ అని సిరిల్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios