Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ లో దారుణం : స్నేహితురాలి తండ్రితో పెళ్లి ఒప్పుకోలేదని.. యువతి కిడ్నాప్, అత్యాచారం.. వీడియో తీసి...

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణ ఘటన జరిగింది. తన స్నేహితురాలి తండ్రితో పెళ్లికి నిరాకరించినందుకు ఓ కాలేజీ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి లైంగికంగా వేధించారు.

girl refuses to marry friends dad, caused torture and sexual assault in pakistan
Author
Hyderabad, First Published Aug 18, 2022, 10:18 AM IST

పాకిస్తాన్‌ : పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఒక కాలేజీ అమ్మాయి తన స్నేహితురాలి తండ్రిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆ అమ్మాయిని స్నేహితురాలు, ఆమె తండ్రి, బంధువులు చిత్రహింసలకు గురిచేసి లైంగికంగా వేధించారు. ఆ తరువాత, ఆమెకు గుండుకొట్టించి, కనుబొమ్మలను గీయించి.. దీన్నంతా వీడియో తీశారు. తాము అడిగిన పది లక్షల డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఆ వీడియోను అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు.

లాహోర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్‌లో ఆగస్ట్ 8న ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. మంగళవారం నాడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి బైటికి వచ్చింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఈ వీడియోలో బాలికను నిందితులు కొట్టి, తల, కనుబొమ్మలను షేవ్ చేసి, బూట్లను నాకేలా చేయడం కనిపిస్తుంది. ప్రధాన నిందితుడు షేక్ డానిష్, అతని కుమార్తెతో పాటు మరో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. "పోలీసులు డానిష్, అతని కుమార్తెతో సహా ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి దాడులు జరుగుతున్నాయి" అని పంజాబ్ పోలీసు ప్రతినిధి తెలిపారు.

ఇదేం విడ్డూరం.. కౌగిలించుకున్నాడని కోర్టు కెక్కింది.. తీర్పు ఏం చెప్పారంటే...

ఈ కేసు వివరాల్లోకి వెడితే.. బాధితురాలు తన ముసలి తల్లితో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇద్దరు సోదరులు యూకే, ఆస్ట్రేలియాల్లో ఉన్నారు. బాధితురాలు డెంటిస్ట్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని. బాలికపై అపహరణ, చిత్రహింసలు, దోపిడీ, లైంగిక వేధింపులకు పాల్పడిన 15 మంది నిందితులపై పాకిస్థాన్ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌లో బాధితురాలు తాను, డానిష్ కుమార్తె అన్నా స్నేహితులమని, ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు "అన్నా తండ్రి షేక్ డానిష్ నాకు పెళ్లి ప్రపోజ్ చేసాడు. కానీ, నేను, మా కుటుంబం ఆ ప్రతిపాదనను ఒప్పుకోలేదు. డానిష్ మా నాన్న వయసు వాడు. నేను అన్నాకు ఈ విషయం చెప్పినప్పుడు, ఆమె నాపై కోపానికి వచ్చింది" అని ఆమె చెప్పింది.

బాధితురాలు మాట్లాడుతూ, ఆగస్టు 8న, ఆమె సోదరుడు యూకే నుండి తిరిగి వచ్చాక.. ‘డానిష్, అతని 14 మంది అనుచరులు మా ఇంటికి వచ్చారు. మళ్ళోసారి వివాహ ప్రతిపాదనను తెచ్చారు. అంగీకరించమని నా సోదరుడిని బలవంతం చేశారు. అయితే నా సోదరుడు ప్రతిపాదనను తిరస్కరించాడు. అయితే డానిష్ తో వచ్చినవారు నన్ను, నా సోదరుడిని హింసించారు. మా ఇద్దరినీ బలవంతంగా డానిష్ ఇంటికి తీసుకెళ్లారు, అక్కడ వారు మళ్లీ కొట్టారు. బలవంతంగా డానిష్ బూట్లను నాకేలా చేశారు. నా తల, కనుబొమ్మలను షేవ్ చేశారు. ఈ అవమానకర చర్యనంతా వీడియో చిత్రీకరించారు’ అని ఆమె చెప్పింది.

ఆ తరువాత "ప్రధాన నిందితుడు (డానిష్) ఆమెను మరొక గదిలోకి తీసుకువెళ్లి.. అక్కడ తన లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆ చర్యను మొత్తం వీడియో తీశాడు’ అని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. దీంతో పాటు నిందితులు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా లాక్కున్నారు. వారి వద్దనుంచి రూ.500,000 దోపిడీ చేసి రూ.450,000 విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని ఆమె తెలిపింది.

ఆ తరువాత నిందితులు రూ.పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఆ మొత్తం చెల్లించకపోతే వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారని బాలిక పోలీసులకు తెలిపింది. పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహి ఈ సంఘటన మీద స్పందించారు. ఈ కేసులో అనుమానితులందరినీ అరెస్టు చేయాలని, వారు ఖఠినంగా శిక్షించబడేలాచూసుకోవాలని పంజాబ్ పోలీసు చీఫ్‌ను ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios