Israel Palestine War: గాజాలోని ఆస్పత్రిపై వైమానిక దాడి .. 500 మంది మృతి !

Israel Palestine War: హమాస్, ఇజ్రాయెల్ మధ్య 11వ రోజు యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10:30 గంటలకు గాజా స్ట్రిప్‌లోని అల్ అహ్లీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందని, అందులో 500 మంది మరణించారని హమాస్ పేర్కొంది. ఈ దాడి నిర్ధారణ అయితే.. ఇది 2008 తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అత్యంత ఘోరమైన దాడి అవుతుంది.

Gaza Says 500 Killed In Airstrikes On Hospital,  Hamas Did It, Says Israel KRJ

Israel Palestine War: హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఈ సందర్భంగా  గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రిపై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో దాదాపు 500 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో గాయపడిన , ఆశ్రయం పొందిన ప్రజలు ఉన్నారు. అయితే ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. దక్షిణ గాజాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. ఈ దాడుల్లో కూడా చాలా మంది చనిపోయారు.

ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న హమాస్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇది ధృవీకరించబడితే.. 2008 నుండి ఇప్పటి వరకు జరిగిన ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అత్యంత ఘోరమైన వైమానిక దాడి ఇదే అవుతుందని భావిస్తున్నారు. అల్-అహ్లీ ఆసుపత్రి నుండి వచ్చిన చిత్రాలు చూస్తుంటే..  ఆసుపత్రి హాలులో మంటలు, పగిలిన గాజు వస్తువులు,  చెల్లాచెదురుగా పడిన శరీర భాగాలు ఆ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. మరోవైపు హమాస్‌ దీనిని యుద్ధ నేరంగా పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది.

దక్షిణ గాజా స్ట్రిప్‌లోని నగరం, చుట్టుపక్కల ప్రాంతాల నివాసితులందరినీ ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించిన తర్వాత గాజా నగరంలోని అనేక ఆసుపత్రులు బాంబు దాడుల నుండి రక్షించబడతాయని ఆశిస్తున్న వందలాది మంది ప్రజలకు ఆశ్రయాలుగా మారాయి. ఆసుపత్రి మరణాలపై ఇంకా ఎలాంటి సమాచారం లేదని ఇజ్రాయెల్ మిలటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. తాము సమాచారాన్ని సేకరిస్తున్నామని అన్నారు. ప్రజలకు అప్‌డేట్ చేస్తాం, ఇది ఇజ్రాయెల్ వైమానిక దాడులో కాదో చెప్పడానికి తమకు ఖచ్చితమైన సమాచారం లేదని అన్నారు. 

హమాస్ దాడిని యుద్ధ నేరంగా అభివర్ణించింది. గాజా స్ట్రిప్‌లోని ఆసుపత్రిపై దాడిని "యుద్ధ నేరం"గా గాజాలోని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది. వైమానిక దాడుల ఫలితంగా వందలాది మంది గాయపడిన వ్యక్తులు ఆసుపత్రిలో ఉన్నారని, మరికొందరు తమ ఇళ్ల నుండి బలవంతంగా తరలించబడ్డారని ఒక ప్రకటన తెలిపింది. వందలాది మంది బాధితులు ఇంకా శిథిలాల కిందనే ఉన్నారని పేర్కొంది.

ఇదిలా ఉంటే.. కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం గురించి మాట్లాడుతున్నాయి. భారత్, అమెరికా, బ్రిటన్, ఉక్రెయిన్ వంటి కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు పలికాయి. ఈ యుద్ధంపై అమెరికా ఆసక్తి చూపుతోంది. ఈ యుద్ధం మధ్యలో దాని రక్షణ మంత్రి మరియు విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్‌ను సందర్శించారు. హమాస్ తీవ్రవాద దాడిని ఎదుర్కొనేందుకు సంఘీభావం తెలిపేందుకు బుధవారం (అక్టోబర్ 18) ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. బిడెన్ తన సోషల్ మీడియాలో "సెమిటిజం, ఇస్లామోఫోబియా , అన్ని ద్వేషాలు ముడిపడి ఉన్నాయని చరిత్ర మనకు పదే పదే నేర్పింది" అని ఆయన రాశారు.

గాజా స్ట్రిప్ నుండి పనిచేస్తున్న హమాస్ అనే ఉగ్ర సంస్థ దక్షిణ ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న ఘోరమైన దాడిని ప్రారంభించింది, ఆ తర్వాత ఇరుపక్షాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇరువైపులా ఇప్పటి వరకు 4,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లెబనీస్ సరిహద్దు నుండి ఉత్తర ఇజ్రాయెల్‌లో చెదురుమదురు దాడులు జరుగుతున్నాయి. యుద్ధం నిరంతరం తీవ్రమవుతుంది. హమాస్‌కు లెబనీస్ సరిహద్దు నుంచి హిజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ నుంచి మద్దతు లభిస్తోంది. ఇజ్రాయెల్ సరిహద్దులో హెజ్బుల్లాహ్ అడపాదడపా దాడులు కూడా చేస్తున్నారు, దీనికి ఇజ్రాయెల్ సైన్యం ప్రతిస్పందిస్తోంది. మరోవైపు.. తాము హమాస్‌ను లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హమాస్ స్థానాలు, మౌలిక సదుపాయాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 

ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు?

హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటివరకు సుమారు 3300 మంది మరణించారు. చనిపోయిన వారిలో పెద్ద సంఖ్యలో చిన్నారులే ఉన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌లో హమాస్ దాడి కారణంగా 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో హమాస్ దాడుల్లో మరణించిన వందలాది మంది పౌరులను ఇజ్రాయెల్ ఫోరెన్సిక్ బృందాలు ఇంకా గుర్తించలేదు. రఫాపై దాడి, ఖాన్ యూనిస్‌లోని మూడు ఇళ్లపై బాంబు దాడి తరువాత రాత్రిపూట ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 80కి పెరిగింది.
 
ఆహార సంక్షోభం

గాజాలో గోధుమలు,పిండి నిల్వలు క్షీణిస్తున్నాయి. గుడ్లు, బ్రెడ్ మరియు కూరగాయల సరఫరా కూడా తీవ్రంగా తగ్గింది. తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడింది. వదిలే నీరు తాగడానికి యోగ్యం కాదు. వ్యవసాయ బావుల్లోని ఉప్పునీటిని చాలా మంది ప్రజలు తాగాల్సి వస్తోంది. ప్రస్తుతం గాజాలో అందుబాటులో ఉన్న నీటిని తాగడం వల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని మానవతావాదులు తెలిపారు. 

గాజాలోని ఆసుపత్రులు ఎమర్జెన్సీ, ట్రామా, సర్జికల్ గేర్‌లతో పాటు బ్లడ్ బ్యాంక్‌లతో సహా వైద్య సామాగ్రి కొరతను ఎదుర్కొంటున్నాయి. గాజాలోని అతి పెద్ద ఆసుపత్రిలో నీరు, ఇంధనం,  మందులు ప్రమాదకర స్తాయిలో కొరత ఏర్పడింది. అక్కడ రోగులను చూసుకోవడంలో వైద్యులు కష్టపడుతున్నారు. విద్యుత్ కోతలు, జనరేటర్లకు ఇంధనం సరఫరా తగ్గిపోవడంతో రోగులకు మరణిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios