Asianet News TeluguAsianet News Telugu

హెలికాఫ్టర్‌లో పారిపోయిన గజదొంగ! ఎక్కడో తెలుసా..?

గజదొంగలు, గ్యాంగ్‌స్టర్‌లు పారిపోయే సన్నివేశాల్ని మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, ప్యారిస్‌లో జరిగిన ఈ సంఘటన మాత్రం యావత్ ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. 

Gangster Escapes Paris Prison By Helicopter

గజదొంగలు, గ్యాంగ్‌స్టర్‌లు పారిపోయే సన్నివేశాల్ని మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, ప్యారిస్‌లో జరిగిన ఈ సంఘటన మాత్రం యావత్ ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలు నుంచి ఓ గ్యాంగ్‌స్టర్‌ను తప్పించేందుకు సదరు ముఠా పెద్ద మాస్టర్ ప్లాన్ వేసింది.

ప్యారిస్ గ్యాంగ్‌స్టర్ రెడైన్ ఫెయిడ్‌ను తప్పించేందుకు ఆయన ముఠా సభ్యులు కొందరు ఆయుధాలు ధరించి జైలు ప్రవేశ ద్వారం వద్ద నాటకీయంగా గొడవకు దిగి పోలీసుల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. ఆ గొడవ ఏంటో తెలుసుకనేందుకు పోలీసులు మొత్తం బయటకు రాగానే, జైలు లోపలకి హెలికాఫ్టర్ ద్వారా మరో ముఠా ప్రవేశించి, గ్యాంగ్‌స్టర్‌ను తప్పించినట్లు అధికారులు చెప్పారు. 

ఫెయిడ్‌ను తప్పించిన హెలికాఫ్టర్‌ను కూడా హైజాక్ చేశారు. ఫెయిడ్ ముఠా సభ్యులు ఓ హెలికాప్టర్ పైలట్‌ను అదుపులోకి తీసుకొని, జైలువైపు వెళ్లాలని బెదిరించారు. ఫెయిడ్‌ను జైలు నుంచి తప్పించగానే పైలట్‌ను, హెలికాఫ్టర్‌ను ముఠా సభ్యులు విడిచిపెట్టేశారు. జైలు నుంచి పారిపోయిన ఫెయిడ్ మార్గ మధ్యంలో పలు కార్లు మారుతూ సినీ ఫక్కీలో పోలీసులకు దొరకుండా ఉడాయించాడు. 

ఇంతకీ ఫెయిడ్ చేసిన నేరం ఏంటి?

రెడైన్ ఫెయిడ్ ఓ దోపిడీ దొంగ, గతంలో ఓ దోపిడీ కేసులో పోలీసు అధికారిని చంపడంతో ఫెయిడ్‌ 25 ఏళ్లు జైలు శిక్ష పడింది. జైలు నుంచి తప్పించుకోవటం ఫెయిడ్‌కు ఇదేం మొదటి సారి కాదు. గతం (2013)లో కూడా నలుగురు జైలు సిబ్బందిని మానవ రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకొని తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఫెయిడ్ కోసం ప్యారిస్ పోలీసులు నగరం అంతా తనిఖీలు చేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఓ మూవీ సీన్‌లా అనిపిస్తోంది కదూ..!

Follow Us:
Download App:
  • android
  • ios