ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు కరోనా సోకింది. వారం రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటానని ఆయన ప్రకటించారు. గురువారం నాడు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది.

కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయన పరీక్షలు చేయించుకొన్నారు.ఈ పరీక్ష్లల్లో ఆయనకు నిర్ధారణ అయింది.ఫ్రాన్స్ జాతీయ నిబంధనల ప్రకారంగా ఏడు రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉంటాడు. రిమోట్ ప్రాంతం నుండి ఆయన తన కార్యకలాపాలను కొనసాగిస్తాడని  ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

 

గతంలో పలువురు దేశాధినేతలు కరోనా బారినపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తదితరులు కరోనా బారినపడ్డారు.ఫ్రాన్స్ లో ఈ వారం ప్రారంభంలో ఆంక్షలను సడలించింది. దీంతో కరోనా కేసులు పెరిగిపోతున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.ఇప్పటికి దేశ వ్యాప్తంగా రాత్రి 8 గంటల నుండి కర్ఫ్యూ ను అమలు చేస్తున్నారు. రెస్టారెంట్లు, థియేటర్లు, కేఫేలు మూసివేశారు.

కరోనా వ్యాప్తి చెందిన సమయం నుండి ఇప్పటివరకు  59 వేల 300 మంది మరణించారు. క్రిస్మస్ రానున్న నేపథ్యంలో షాపింగ్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున బయటకు రావడంతో కొత్తగా కేసులు నమోదౌతున్నాయి.  బుధవారం నాడు ఒక్క రోజే 17 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.