కుప్పకూలిన బాల్టిమోర్ లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి.. వీడియోలు వైరల్..

ఓ భారీ కార్గో షిప్ ఢీకొట్టడంతో అమెరికా మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనాలు కూడా నీటిలో పడిపోయాయి.

Francis Scott Key Bridge in Baltimore collapses The videos have gone viral..ISR

అమెరికా మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఓ భారీ నౌక ఢీకొనడంతో బిడ్జిలోని ఒక భాగం కూలిపోయింది. దీంతో దానిపై ఉన్న పలు వాహనాలు కింద నీటిలో పడిపోయాయి. తెల్లవారు జామున 1.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన నగరంలో ప్రకంపనలు సృష్టించింది. అయితే బ్రిడ్జి కుప్పకూలిపోతున్న సమయంలో తీసిన పలు వీడియోలు ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాల్టిమోర్ లోని  ప్రయాణికులకు కీలకమైన బ్రిడ్జి ఇది. ఆ బ్రిడ్జి కింది నుంచి భారీ షిప్ లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ భారీ కార్గో షిప్ కూడా బ్రిడ్జి కింది నుంచి వెళ్తున్న క్రమంలో నీటిలో ఉన్న ఓ పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే బ్రిడ్జిలో ఉన్న పలు భాగాలు కూలిపోయాయి. శిథిలాలు నీటిలోకి పడిపోయాయి.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో పలు వాహనాలు ఆ బ్రిడ్జి పై నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే బ్రిడ్జి కూలిపోవడంతో ఆ వాహనాలు కూడా నీటిలో పడిపోయాయి. ఈ ఘటన నేపథ్యంలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని మూసివేస్తున్నట్లు మేరీల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ ప్రకటించింది. 

అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందా ? లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. నష్టాన్ని అంచనా వేయడానికి, బాధితుల భద్రతను నిర్ధారించడానికి అత్యవసర సిబ్బంది పని చేస్తున్నారు. కాగా.. ఈ ప్రాంత రవాణా నెట్ వర్క్ లో కీలకమైన లింక్ అయిన ఈ బ్రిడ్జి కూలిపోవడం వల్ల ప్రయాణికులకు, అక్కడ జరిగే వ్యాపారాలకు తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయని భావిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios