ఫ్రాన్స్‌లో ఒకే రోజు 1,04,611 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఫ్రాన్స్ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత మూడు రోజుల నుంచి దేశంలో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ (emmanuel macron) అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ (omicron) భయాలు నెలకొన్న నేపథ్యంలో కరోనా కేసులు (corona cases) సైతం భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూరప్ ఖండాన్ని (europe) కోవిడ్ వణికిస్తోంది. బ్రిటన్ (britain) , జర్మనీ ( germany) , నెదర్లాండ్స్‌లో (netherlands) పరిస్ధితి దారుణంగా వుంది. అటు ఫ్రాన్స్‌లోనూ (france) కేసులు పెరుగుతున్నాయి. అక్కడ ఒకే రోజు 1,04,611 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఫ్రాన్స్ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత మూడు రోజుల నుంచి దేశంలో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ (emmanuel macron) అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. అటు కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం చర్చించనున్నారు.
మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్‌కు (booster dose) కూడా ఫ్రాన్స్ అనుమతి ఇచ్చింది. రెండు డోసులు వేసుకుని మూడు నెలలు పూర్తయితే బూస్టర్ డోసు తీసుకోవచ్చని దేశ ప్రజలకు సూచించింది. బూస్టర్ డోస్‌కు ప్రజలు అంగీకరిస్తేనే మొదటి రెండు డోసులకు సంబంధించి చెల్లుబాటు అయ్యే పాస్‌ను జారీ చేయాలని ఫ్రాన్స్ ప్రభుత్వం యోచిస్తోంది. కేఫ్‌లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాలు, అంతర్జాతీయ రాకపోకలకు ఈ పాస్‌ను తప్పనిసరి చేయనున్నారు. కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 1,22,546 మంది మరణించారు. అక్కడ 76.5 శాతం వ్యాక్సినేషన్ సైతం పూర్తయింది.
ALso Read:దేశంలో విజృంభిస్తోన్నOmicron .. ఎన్ని కేసులు నమోదయ్యాంటే..?
మరోవైపు ప్రపంచదేశాలను దడపుట్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్‌నూ కలవర పెడుతోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422 కు చేరింది. ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 130 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా ఇతర రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియెంట్ విస్తరిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43, తెలంగాణలో 41, కేరళలో 38, తమిళనాడులో 34, కర్ణాటకలో 31 కేసులు నమోదయ్యాయి.
ఇదిలాఉంటే.. మరోవైపు కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,987 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ మహమ్మారికి 162 మంది బలయ్యారు.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,79,682 మంది కరోనాతో మరణించారు. అలాగే.. ప్రస్తుతం కరోనా రికవరీ సంఖ్య రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉంది. కాగా.. గడిచిన 24 గంటల్లో 7,091 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీ అయిన వారి సంఖ్య 3,42,30,354 కు చేరింది.
