ఈ నేపథ్యంలో నల్ల దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు అతడి దగ్గరకు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత నల్ల దుస్తుల్లోని ఓ నిందితుడు కత్తితో అతడిపై దాడి చేశాడు. బాధితుడు భయంతో ఫుట్ పాత్ మీదకు వచ్చాడు. అయినా నిందితుడు దాడి మానలేదు. 

లండన్ : ఫుట్ పాత్ మీద అందరూ చూస్తుండగా ఓ వక్తిమీద కత్తితో దాడి చేశాడో దుండగుడు. ఆ దాడిలో సదరు బాధితుడి చేతివేలు తెగి, దూరంగా ఎగిరిపడింది. ఇంగ్లాండ్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాడ్, సాల్ ఫోర్డ్ కు చెందిన ఓ వ్యక్తి సోమవారం చీతమ్ ఏరియాలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు.

ఈ నేపథ్యంలో నల్ల దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు అతడి దగ్గరకు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత నల్ల దుస్తుల్లోని ఓ నిందితుడు కత్తితో అతడిపై దాడి చేశాడు. బాధితుడు భయంతో ఫుట్ పాత్ మీదకు వచ్చాడు. అయినా నిందితుడు దాడి మానలేదు. 

చుట్టూ దూరంగా ఉన్న జనం తోలు బొమ్మలాట చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయారు. నిందితుడు కత్తితో పలుమార్లు దాడి చేశాడు. బాధితుడు చెయ్యి అడ్డం పెట్టడంతో వేలు తెగి, దూరంగా ఎగిరిపోయింది. తలమీద రెండు దెబ్బలు వేసి నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు.

అనంతరం ‘ప్లీజ్! నా వేలును వెతికి పెట్టండి’ అంటూ బాధితుడు అక్కడి జనాన్ని ప్రాధేయపడ్డాడు. దొరికిన వేతిలో అతడ్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని ఆధారంగా విచారణ చేస్తున్నారు.