Asianet News TeluguAsianet News Telugu

మోడీ బంగ్లాదేశ్ పర్యటన: భారీగా నిరసనలు, నలుగురు ఆందోళనకారులు మృతి

రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ వెళ్లిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పర్యటనను నిరసిస్తూ చిట్టగాంగ్‌లో కొందరు నిరసనకు దిగారు.

four killed in bangladesh during protests against pm narendra modis visit ksp
Author
Dhaka, First Published Mar 26, 2021, 9:53 PM IST

రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ వెళ్లిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పర్యటనను నిరసిస్తూ చిట్టగాంగ్‌లో కొందరు నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నిరసనకారులు పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి విధ్వంసానికి ప్రయత్నించడంతో వారిని చెదరగొట్టేందుకు తొలుత బాష్పవాయు గోళాలు, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించారు పోలీసులు.

అయినప్పటికీ పరిస్ధితిలో మార్పు లేకపోవడంతో పోలీసులు కాల్పులకు దిగారు. మరోవైపు, మోడీ పర్యటనను నిరసిస్తూ రాజధాని ఢాకాలోనూ కొందరు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన ఘర్షణలో ఇద్దరు పాత్రికేయులు సహా పలువురికి గాయాలైనట్టు సమాచారం.   

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం తాను సత్యాగ్రహం చేసినట్లు చెప్పారు ప్రధాని నరేంద్రమోడీ. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఢాకాలోని నేషనల్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బంగ్లాదేశ్ నేషనల్ డే ఉత్సవాల్లో మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తన జీవితంలో ఈ రోజు చాలా ముఖ్యమైనదని ఈరోజు ఎన్నటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో తనను భాగస్వామిని చేసినందుకు బంగ్లాదేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios