Barack Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కోవిడ్ 19 నిర్థార‌ణ పరీక్షలు చేయించుకోగా.. పాజివిట్ అని నిర్ణార‌ణ అయ్యింది. త‌న‌కు గ‌త రెండు రోజు గొంతు నొప్పి ఉండ‌టంతో కరోనా ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉన్న‌ట్టు తెలిపారు. 

Barack Obama: కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. ఏ దేశంలో చూసినా ప‌రిస్థితులు చేదాటిపోయాయి. ప్ర‌పంచ దేశాల‌ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సాధార‌ణ పౌరుడి నుంచి దేశ‌ ప్రధాని వరకు ఏ ఒక్కరిని కూడా వైరస్ వదలడం లేదు. చైనాలోని వూహాన్‌లో మొదలైన ఈ వైరస్ దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించేసింది. వైద్యరంగంలో, ఆర్థికంగా ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న అమెరికాను కూడా కరోనా వైరస్ వదల్లేదు. ప్రపంచంలో ఇప్పటివరకు అధిక కేసులు నమోదైన దేశంగా అమెరికా వార్తల్లోకెక్కింది. 

ఇదిలా ఉండగా.. తాజాగా.. అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు ఒబామాకు క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయ్యింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయిన‌ట్టు ఆయ‌న తన ట్విట్టర్ ఖాతాలో ప్ర‌క‌టించారు. త‌న‌కు గ‌త రెండు రోజులుగా గొంతులో నొప్పి.. దీంతో కోవిడ్ 19 ప‌రీక్ష‌లు చేయించుకోక‌.. పాజివిట్ గా నిర్థార‌ణ అయ్యింద‌ని తెలిపారు. త‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌నీ, తాను బాగానే ఉన్నానని ఒబామా ట్వీట్ చేశారు. ఇదే క్ర‌మంలో త‌న భార్య, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కు క‌రోనా నెటివిట్ గా నిర్ణర‌ణ అయిన‌ట్టు తెలిపారు

ఒబామా, తోటి మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, జార్జ్ డబ్ల్యూ. బుష్, బిల్ క్లింటన్ మరియు మాజీ ప్రథమ మహిళలు క‌రోనా వ్యాక్సినేషన్ పై గత మార్చిలో ఒక నిమిషం నిడివిగల వీడియోను విడుదల చేయించారు. క‌రోనా వ్యాక్సినేష‌న్ వేయించుకోవాల‌ని, నిండైన జీవితానికి క‌రోనా వ్యాక్సినేష‌న్ త‌ప్ప‌ని స‌రి. వ్యాక్సిన్ అంటే ఆశ . ఇది మిమ్మల్ని మరియు మీరు ఇష్టపడే వారిని ఈ ప్రమాదకరమైన, ప్రాణాంతక వ్యాధి నుండి రక్షిస్తుంది."అని ఒబామా వీడియోలో పేర్కొన్నారుకేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మీరు ఇప్పటికే టీకాలు వేయకుంటే, తన స్వంత పాజిటివ్ పరీక్ష అనేది ఒక రిమైండర్" అని పేర్కొన్నారు.

US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. అమెరికాలో రోజువారీ కేసుల సంఖ్య బాగా పడిపోయింది. జనవరి మధ్యలో రోజుకు సగటున 810,000 కేసుల గరిష్ట స్థాయితో పోలిస్తే మార్చి మధ్యలో రోజుకు సగటున 35,000 కేసులు నమోదయ్యాయి.