మాజీ టీవీ యాంకర్ మీనా దారుణహత్య

First Published 11, May 2019, 8:55 PM IST
Former TV Presenter meena mangal Shot Dead In afghanistan
Highlights

ఆఫ్గనిస్తాన్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారు, మాజీ జర్నలిస్ట్ మీనా మంగళ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. 

ఆఫ్గనిస్తాన్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారు, మాజీ జర్నలిస్ట్ మీనా మంగళ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కాబూల్ 8వ జిల్లాల్లోని కార్తేవన్ మార్కెట్ రోడ్డులో శనివారం ఉదయం 7.20 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మీనాపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తొలుత నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి జనాన్ని చెదరగొట్టారు. అనంతరం నేరుగా ఆమె ఛాతి భాగంలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.

దీంతో మీనా కుప్పకూలిపోవడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పదేళ్ల పాటు టీవీ జర్నలిస్టుగా పనిచేసిన మీనా మంగళ్ పని చేశారు.

బాలికలు, స్త్రీల సమస్యలపై ఆమె పోరాటం చేస్తున్నారు. కాగా, తనను చంపేస్తామంటూ కొందరు బెదరిస్తున్నారని ఆమె సన్నిహితుల దగ్గర ప్రస్తావించిన కొద్దిరోజులకే మీనా దారుణ హత్యకు గురికావడం గమనార్హం. 

loader