సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ తన 91 ఏళ్ల వయస్సులో అనారోగ్య కారణాలతో మంగళవారం చనిపోయారు. మూత్రపిండాల వ్యాధితో ఆయన జూన్ లో హాస్పిటల్ లో చేరి, అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. 

సోవియట్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ (91) అనారోగ్య కార‌ణాల‌తో మృతి చెందారు. ఈ విష‌యాన్ని ర‌ష్యా ఏజెన్సీలు ధృవీక‌రించాయి. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింద‌ని రష్యా వార్తా సంస్థ ‘స్పుత్నిక్’ పేర్కొంది. జూన్‌లో తీవ్రమైన కిడ్నీ వ్యాధితో ఆయన హాస్పిటల్లో చేరారు. 

జార్ఖండ్ లో రిసార్ట్ రాజకీయాలు షురూ.. రాయ్‌పూర్‌కు వెళ్లిన యూపీఏ ఎమ్మెల్యేలు..

సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ ప్రచ్ఛన్న యుద్ధాన్ని రక్తపాత పోరాటం లేకుండా ముగించారు. అయినప్పటికీ సోవియట్ యూనియన్ పతనాన్ని నిరోధించడంలో ఆయ‌న విఫ‌లమ‌య్యారు. ఆయ‌న మిఖాయిల్ గోర్బచెవ్ USSR చివరి నాయకుడు. పౌరులకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్య సూత్రాల తరహాలో కమ్యూనిస్ట్ పాలనను సంస్కరించాలని కోరుకునే బలమైన సోవియట్ నాయకుడిగా ఆయ‌నను గుర్తిస్తారు. సోవియట్ రాజకీయవేత్త మృతి పట్ల అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసినట్లు క్రెమ్లిన్ ప్రతినిధి మీడియాకు తెలిపారు.

భారత నావికాదళానికి కొత్త జెండా.. కొచ్చిలో ఆవిష్క‌రించ‌నున్న ప్ర‌ధాని మోడీ

మిఖాయిల్ గోర్బచేవ్ 1931 మార్చి 2న పేద కుటుంబంలో జన్మించాడు. 1985లో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కేవలం 54 సంవత్సరాల వయస్సులో పరిమిత రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవస్థను పునరుద్ధరించాలని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. అయితే ఆయ‌న సంస్కరణలు అదుపు తప్పాయి. కమ్యూనిస్ట్ తూర్పు ఐరోపాలోని సోవియట్ కూటమి దేశాలలో 1989లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు తీవ్రరూపం దాల్చినప్పుడు ఆయ‌న త‌న బలప్రయోగాన్ని మానుకున్నారు.

Scroll to load tweet…

అధ్యక్ష పదవిని విడిచిపెట్టిన తర్వాత మిఖాయిల్ గోర్బచెవ్‌కు ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు, గౌరవాలు లభించాయి. గోర్బచెవ్‌కు 1990లో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. ప్రచ్ఛన్న యుద్ధాన్ని రక్తపాతం లేకుండా ముగించడంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించిన కారణంగా ఆయ‌న‌కు ఈ స‌త్కారం లభించింది.