పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి టిప్పు సుల్తాన్ ను మైసూర్ టైగర్ అని పిలవడానికి బదులుగా బెంగాల్ సింహంగా అభివర్ణించారు. దీంతో నెటిజన్లు ఆయనను ఒక ఆట ఆడుకున్నారు. ఆయన గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ట్రోలింగ్ కు గురయ్యారు.
టిప్పు సుల్తాన్‌ను బెంగాల్ సింహం అని పిలిచినందుకు పాకిస్థాన్ మాజీ మంత్రి, పీటీఐ నేత ఫవాద్ చౌదరిని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. “ 1799 సంవత్సరంలో ఈ రోజున బెంగాల్ సింహం టిప్పు సుల్తాన్ మైసూర్‌లోని తన కోటను కాపాడుతూ అమరుడయ్యాడు. టిప్పు సుల్తాన్ బలిదానం బ్రిటిష్ వారికి భారతదేశపు తలుపులను తెరిచింది. దీని తరువాత భారతదేశాన్ని బానిసత్వం పట్టుకుంది.’’ అని ఫవాద్ చౌదరి ఉర్దూలో ఇలా ట్వీట్ చేశారు. ఆయన పాకిస్థాన్ సమాచార, ప్రసార మంత్రిగా పని చేశారు.
టిప్పు సుల్తాన్ ను మైసూర్ టైగర్ అని పిలుస్తారు. ఆయన 1782 నుంచి 1799లో మరణించే వరకు మైసూర్ భారత రాజ్యానికి వాస్తవ పాలకుడు. ఈ విషయాన్ని పాక్ మాజీ మంత్రి విస్మరించారో ఏమో కానీ ఆయన మైసూర్ టైగర్ కు బదులు బెంగాల్ సింహం అని అభివర్ణించారు. దీనిని సోషల్ మీడియా యూజర్లు ఎత్తి చూపారు. ఆయనను ట్రోల్ చేస్తూ ఆడుకున్నారు.
పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి చేసిన ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షార్ట్ ను ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ నైలా ఇనాయత్ షేర్ చేశారు. ‘‘ ఒకప్పుడు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ ఇప్పుడు జర్మనీ-జపాన్ సరిహద్దు తయారీదారులకు ‘‘లయన్ ఆఫ్ బెంగాల్’’ అని వెల్లుల్లిని అడ్రక్ గా మార్చినట్టు మార్చారు ’’ అని ట్వీట్ చేశారు. ఒక ట్విట్టర్ వినియోగదారుడు ఫవాద్ చౌదరిని టిప్పు మైసూరు పులి అని, బెంగాల్ టైగర్ కాదని సరిచేశాడు. కోల్‌కతా నుండి మైసూర్ కు 2,000 కిలో మీటర్ల దూరం ఉందని చెప్పాడు.
ఫవాద్ చౌదరి ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ ఉంటారు. ఆయనను నెటిజన్లతో తరచూ ట్రోలింగ్ కు గురవుతూ ఉంటారు. ఇలాగే గతేడాది నవంబర్‌లో అల్లం, వెల్లుల్లి మధ్య తేడా తెలియక తికమక పడ్డారు. ద్రవ్యోల్బణంపై విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో చౌదరికి ఉర్దూలో వెల్లుల్లి అని ఏమని పిలుస్తారో గుర్తుకు రాలేదు. చుట్టుపక్కల వారు వెల్లుల్లి అంటే లెహ్సున్ అని చెపపారు. కానీ ఆయనకు సరిగా వినిపించలేదో ఏమో ‘‘వెల్లుల్లి అద్రాక్ (అల్లం)’’ అని చెప్పారు. వెల్లుల్లి, ఉల్లి ధరల తగ్గుదల గురించి ఆయన మాట్లాడుతున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. దీంతో అప్పుడు కూడా నెటిజన్లు ఆయనతో ఆడుకున్నారు. అలాగే 2019లో హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ను నాసాకు బదులుగా పాకిస్థాన్ అంతరిక్ష సంస్థ సుపార్కో అంతరిక్షంలోకి పంపిందని చౌదరి చెప్పడంతో ఆయన ట్రోలింగ్ గురయ్యారు.
