వార్తలు చదువుతున్నది... : న్యూస్ ప్రజెంటర్ గా మారిన బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్...
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరలో ఓ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా కనిపించనున్నారు.
లండన్ : బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ న్యూస్ రీడర్ గా మారనున్నారు. శుక్రవారం తాను టెలివిజన్ స్టేషన్ జీబీ న్యూస్‌లో చేరనున్నానని, డైలీ మెయిల్ వార్తాపత్రికకు కాలమిస్ట్‌గా తన ఉద్యోగానికి మరో మీడియా పాత్రను జోడించబోతున్నానని చెప్పారు.
"రష్యా నుండి చైనా వరకు, ఉక్రెయిన్‌లో యుద్ధం, ఆ సవాళ్లన్నింటినీ మనం ఎలా ఎదుర్కొంటాం, మనకు ఎదురుగా ఉన్న భారీ అవకాశాల గురించి నేను ఈ అద్భుతమైన కొత్త టీవీ ఛానెల్‌కు నా స్పష్టమైన అభిప్రాయాలను అందించబోతున్నాను" అని బోరిస్ జాన్సన్ ఎక్స్ లో తెలిపారు.
బోరిస్ జాన్సన్ 2024 ప్రారంభం నుంచి ప్రెజెంటర్, ప్రోగ్రామ్ మేకర్, వ్యాఖ్యాతగా పని చేస్తారని, వచ్చే ఏడాది బ్రిటన్ తో జరుగనున్నజాతీయ ఎన్నికలను కవర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని GB న్యూస్ తెలిపింది, అలాగే యునైటెడ్ స్టేట్స్‌లో జరిగే ఎన్నికలను కూడా కవర్ చేస్తారని పేర్కొంది.
ఇతర బ్రిటీష్ ప్రసారకర్తల కంటే ఫాక్స్ న్యూస్ వంటి యూఎస్ నెట్‌వర్క్‌ల మాదిరిగానే వార్తలు, అభిప్రాయాలు, విశ్లేషణల మిశ్రమంతో జీబీ టీవీ ఛానెల్ 2021లో ప్రారంభించబడింది. బ్రిటన్ బ్రాడ్‌కాస్టింగ్ వాచ్‌డాగ్ వివిధ సందర్భాలలో స్టేషన్ నిష్పక్షపాత నిబంధనలను ఉల్లంఘించిందని తీర్పునిచ్చింది.
యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బయటకు రావాలనే ఉద్యమం వెనుక ప్రధాన రాజకీయ నాయకుడిగా జాన్సన్ ఉన్నారు. ఆ తరువాతి యేడు జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి 2019లో ప్రధానమంత్రి అయ్యాడు. కానీ అనేక కుంభకోణాల తర్వాత అనేక మంది కన్జర్వేటివ్ పార్టీ శాసనసభ్యుల మద్దతును కోల్పోయి, 2022లో రాజీనామా చేశాడు. రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పనిచేసిన జాన్సన్ జూన్‌లో డైలీ మెయిల్‌కు కాలమ్స్ రాయడం ప్రారంభించాడు.