ఫ్లైట్‌లో పీకలదాకా తాగి పక్కనే కూర్చున్న తల్లీ, బిడ్డలపై చేతులు వేస్తూ అసభ్యంగా! బ్రా స్ట్రాప్స్ లాగేయాలని..!
అమెరికాకు చెందిన ఓ ఫ్లైట్‌లో ఫుల్లుగా వోడ్కా, వైన్ తాగిన ప్రయాణికుడు, పక్కనే కూర్చున్న 16 ఏళ్ల బాలిక, ఆమె తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. తమ బాధను ఫ్లైట్ సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదని బాధితులు పేర్కొన్నారు. ఆ తర్వాత వారు కోర్టులో ఓ లాసూట్ వేశారు.

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఓ ఫ్లైట్‌లో తల్లీ, బిడ్డలపై పక్కనే కూర్చున్న ఓ తాగుబోతు లైంగిక వేధింపులకు దిగాడు. తొమ్మిది గంటల సుదీర్ఘంగా ప్రయాణిస్తున్న ఆ ఫ్లైట్‌లో ఓ మందుబాబు పక్కనే కూర్చున్న 16 ఏళ్ల బాలికను అసభ్యకరంగా తాకాడు. ఆమె తన తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నప్పుడు ఆమె దుస్తుల్లోపల చేయి పెట్టి బ్రా వరకు వెళ్లాడు. ఆ తర్వాత ఆ బాలిక తల్లి కాళ్లనూ చేయితో తడిమాడు. ఆ చేతిని పైకి జరిపి తొడల వరకు పోనిచ్చాడు. తాము ఈ వేధింపులు ఎదుర్కొంటున్నామని స్టాఫ్‌కు చెప్పినా వారు పట్టించుకోలేదని ఆ తల్లీ బిడ్డలు న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో లాసూట్ ఫైల్ చేశారు.
న్యూయార్క్ నుంచి ఏథెన్స్‌కు ప్రయాణించిన డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది గంటల ప్రయాణంలో కనీసం 10 గ్లాసుల వొడ్కా, ఒక గ్లాసు వైన్ సేవించాడు. మద్యం మత్తులోకి వెళ్లిన ఆ ప్రయాణికుడు పక్కనే ఉన్న 16 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె వ్యక్తిగత వివరాలు, చిరునామాను అడిగాడని, అసభ్యకర సంజ్ఞలు చేశారని తల్లి లాసూట్‌లో ఆరోపించింది. ఆమె మైనర్ అని తల్లి చెప్పినా పట్టించుకోలేదని పేర్కొంది. వారిద్దరిపైనా పెద్దగా అరిచాడని తెలిపింది.
ఈ వ్యవహారాన్ని తాము ఫ్లైట్ అటెండాంట్‌కు చెబితే వారు పట్టించుకోలేదని, ఓపికతో ఉండాలని తిరిగి తమకే చెప్పారని ఆ మహిళ పేర్కొంది. తన కూతురును తరుచూ ముట్టుకుంటూ.. బయటికి వినిపించకుండా మాట్లాడుతూ, వారి ముందున్న సీట్లను కొడుతూ దురుసుగా వ్యవహరించాని తెలిపింది. పలుమార్లు తాము ఫ్లైట్ అటెండాంట్‌కు అభ్యర్థిస్తే.. ఒక్కసారి ఆ వ్యక్తి తమతో మాట్లాడొద్దని సూచించారని వివరించింది. దీంతో ఆ వ్యక్తి తమపై మరింత అరిచాడని తెలిపింది.
Also Read: నా భార్యకు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ రాయ్.. చాట్‌జీపీటీని అడిగాడు.. ఏమని రాసిందంటే?
కూతురు తన ఒడిలో పడుకున్నప్పుడు ఆ వ్యక్తి టీనేజీ బాలిక షర్ట్ కిందికి వేళ్లను పోనిచ్చాడని, ఆమె బ్రా దారాలను పట్టుకునే ప్రయత్నం చేశాడని వివరించింది. దీంతో తన బిడ్డ భయంతో ఎగిరి గంతేసిందని తెలిపింది. ఆ తర్వాత తన కాళ్లను ముట్టుకున్నాడని, తొడల వరకు చేతులతో తాకాడాని, తానూ భయంతో అరుపు వేశానని వివరించింది.
తమ సీట్లను మార్చాలని మళ్లీ ఫ్లైట్ అటెండాంట్‌ను కోరితే.. ఆ వీలు లేదని, దయచేసి సర్దుకోవాలని మాత్రమే సూచించారని, ఓ వ్యక్తి మార్చుకోవడానికి సిద్ధమై తనకు, ఆ మందుబాబు మధ్యలో కూర్చున్నాడని వివరించింది.
ఫ్లైట్ ఏథెన్స్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఆ మందుబాబును ఎయిర్‌లైన్స్ ఏమీ అనకుండా వదిలిపెట్టారని కోర్టును ఆశ్రయించారు. వారికి ఆ ఎయిర్‌లైన్స్ 5,000 మైళ్ల ఉచిత ప్రయాణాన్ని ఆఫర్ చేసింది.