కరోనా సోకిన మొదటి కుక్క మృతి

కరోనా వైరస్  సోకిన కుక్క మరణించింది. కరోనా లక్షణాలతో పోరాటం చేస్తూ జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్క అమెరికాలో ప్రాణాలు విడిచింది. కరోనా సోకిన శునకంగా ఇది రికార్డుల్లోకి ఎక్కింది.

First dog that tested positive for COVID-19 dies in New York

న్యూయార్క్:కరోనా వైరస్  సోకిన కుక్క మరణించింది. కరోనా లక్షణాలతో పోరాటం చేస్తూ జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్క అమెరికాలో ప్రాణాలు విడిచింది. కరోనా సోకిన శునకంగా ఇది రికార్డుల్లోకి ఎక్కింది.

కరోనా వైరస్ మనుషులతో పాటు జంతువులపై కూడ తన ప్రభావాన్ని చూపుతోంది. అమెరికాలో ఇదివరకు ఓ పులికి కరోనా సోకింది. అమెరికాలో తొలుత పులికి కరోనా సోకింది. ఆ తర్వాత కుక్కకు కూడ ఈ వైరస్ సోకిందని అధికారులు ప్రకటించారు.

ఏడేళ్ల వయస్సున్న బుడ్డీ అనే పెంపుడు శునకాన్ని రాబర్ట్‌ మహోనీ అనే వ్యక్తి పెంచుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో రాబర్ట్ కు కరోనా సోకింది. ఆయన కరోనా నుండి కోలుకొన్నారు. అదే సమయంలో పెంపుడు కుక్క అనారోగ్యానికి గురైంది.  దీంతో ఆ కుక్కకు పరీక్షలు నిర్వహిస్తే కరోనా సోకినట్టుగా తేలింది.

బుడ్డీకి  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ముక్కు మూసుకోవడం వంటి సమస్యలో బాధపడింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగింది. ఈ వైరస్ బారినపడిన శునకం ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. 

వైరస్ ధాటికి తట్టుకోలేక ఆ శునకం రక్తంతో కూడిన వాంతులు చేసుకొంది. వాంతులు చేసుకొన్న కొద్ది గంటల్లోనే కుక్క మరణించిందని యజమాని మహోనీస్ చెప్పారు. కుక్క కళేబరాన్ని ఖననం చేశారు. అమెరికాలో ఇప్పటివరకు 10 పిల్లులు, 12 కుక్కలు, ఓ పులి, సింహం కరోనా బారిన పడ్డాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios