Asianet News TeluguAsianet News Telugu

తైవాన్‌లో విషాదం: 13 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం, 46 మంది సజీవ దహనం


దక్షిణ తైవాన్ లో ఓ బహుళ అంతస్తులో చోటు చేసుకొన్న అగ్ని ప్రమాదంలో 46 మంది సజీవ దహనమయ్యారు. మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Fire in southern Taiwan leaves 46 people dead, dozens injured
Author
Taiwan, First Published Oct 14, 2021, 4:19 PM IST

తైపీ: దక్షిణ Taiwan లో ఓ భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 46 మంది సజీవ దహనమయ్యారు. ఇంకా 41 మంది గాయపడ్డారు.దక్షిణ తైవాన్‌లోని Kaohsiung నగరంలోని 13 అంతస్తుల భవనంలో గురువారం నాడు తెల్లవారుజామున Fire accident. ఒక అంతస్తు నుండి మరో అంతస్తుకు మంటలు వ్యాపించాయి. సుమారు 11 మృతదేహాలను మార్చురికి పంపామని అగ్నిమాపక చీఫ్ లి చింగ్ మీడియాకు తెలిపారు. ఆసుపత్రికి తరలించిన 55 మందిలో 14 మంది మృతి చెందారని ఆయన వివరించారు. 

also read:దాచేపల్లిలో దారుణం... మంటల్లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనం

అగ్నిమాపకసిబ్బంది ఇవాళ మధ్యాహ్నం వరకు సహాయక చర్యలు చేపట్టారు.అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భారీ శబ్దం విన్పించిందని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు.

40 ఏళ్ల క్రితం ఈ భవనం నిర్మించారు. దుకాణాలు, అపార్ట్‌మెంట్లతో ఈ భవనాన్ని నిర్మించారు.బహుళ అంతస్థుల భవనంలో ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోకపోతే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు స్పష్టమైన కారణాలు చెప్పడం లేదు. అయితే ఈ విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

భారీగా మంటలు వ్యాపించడంతో ఈ భవనంలోని పలు ప్లాట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. నల్లటి పొగ ఈ భవనంలో వ్యాపించి ఉందని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ఈ భవనంలో ఫైర్ ఫైటర్లు మంటలను ఆర్పుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్నాయి


 

Follow Us:
Download App:
  • android
  • ios