Fire accident : డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..17 మందికి గాయాలు..
డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో అగ్నిప్రమాదం సంభవించడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ ఘటనలో 27 మంది మరణించగా.. మరో 17 మందికి గాయాలు అయ్యాయి.
డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం (fire accident in drug rehabilitation center )లో జరిగింది. ఈ ఘటనలో 27 మంది సజీవ దహనం అయ్యారు. మరో 17 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం ఉత్తర ఇరాన్ లో శుక్రవారం చోటు చేసుకుంది. నగరంలో ఉన్న ఓ ప్రైవేట్ రీహాబిలిటేషన్ సెంటర్ లో నేటి తెల్లవారుజామున ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.
Womens Reservations: మహిళా రిజర్వేషన్లను ఇప్పుడే అమలు చేయాలని ఆదేశించలేం - సుప్రీంకోర్టు
అప్పటికీ ఇంకా చీకటే ఉండటంతో ఈ మంటలు చాలా దూరం కనిపించాయి. దీంతో హుటాహుటిన అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. వెంటనే మంటలను ఆర్పివేశాయి. అయితే ఎగిసిపడుతున్న మంటలు, ఆకాశంలోకి వెలువడుతున్న పొగకు సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని రాజధాని టెహ్రాన్ కు వాయువ్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రౌడ్ నగరంలోని పలు హాస్పిటల్స్ కు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
అయితే ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏంటో ఇంకా పూర్తిగా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం, భద్రతకు అవసరమైన సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం, అత్యవసర సేవలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతున్నాయి.
పార్టీ ఆదేశిస్తే కర్ణాటక సీఎం కావడానికి సిద్ధమే - మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే
కాగా.. సెప్టెంబర్ లో ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కారు బ్యాటరీ ఫ్యాక్టరీలో వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ఇందులో ఇలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు.