ఒకేసారి 50 కార్లు కాలిపోతే.. ఇలా ఉంటుంది

First Published 3, Jul 2018, 6:52 PM IST
Fire accident in Otedola Bridge at Lagos-Ibadan Expressway
Highlights

ఒకేసారి 50 కార్లు కాలిపోతే.. ఇలా ఉంటుంది

మన పక్కన చిన్న అగ్నిప్రమాదం జరిగితేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుతాం.. అలాంటిది ఒకేసారి 50 కార్లు తగలబడి అక్కడున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అటువంటి ప్రమాదం లాగోస్‌లో జరిగింది. లాగోస్-ఇబాదాన్ ఎక్స్‌ప్రెస్‌వే పై ఓట్‌డోలా వంతెనపై ఓ పెట్రోల్ ట్యాంకర్ ‌ఇంధనాన్ని నింపుతున్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో అటుగా వెళ్తొన్న కార్లు అగ్నికి బూడిదయ్యాయి. ప్రాథమికంగా సుమారు 50 కార్లు దగ్థమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో అక్కడున్న వారు కార్లను వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సమయంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 


    
 

loader