తల్లికి కరోనా: తల్లడిల్లిన కొడుకు కిటికి వద్దే ఇలా...
కరోనా సోకిన తల్లిని ఆసుపత్రి కిటికి వద్దే కూర్చుని ఆమె బాగోగులు చూసుకొన్నాడు ఓ కొడుకు.అయితే చివరకు కరోనాతో పోరాడలేక ఆ తల్లి కన్నుమూసింది. కన్నుమూసే ముందు తన కొడుకును తనివితీరా చూసుకొంది. ఈ ఘటన పాలస్తీనాలో చోటు చేసుకొంది.
జెరూసలేం: కరోనా సోకిన తల్లిని ఆసుపత్రి కిటికి వద్దే కూర్చుని ఆమె బాగోగులు చూసుకొన్నాడు ఓ కొడుకు.అయితే చివరకు కరోనాతో పోరాడలేక ఆ తల్లి కన్నుమూసింది. కన్నుమూసే ముందు తన కొడుకును తనివితీరా చూసుకొంది. ఈ ఘటన పాలస్తీనాలో చోటు చేసుకొంది.
పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంకుకు చెందిన జిహాద్ అల్ సువైతి తల్లి రష్మీ సువైతీకి కరోనా సోకింది. ఆమె వయస్సు 73 ఏళ్లు. కరోనా చికిత్స కోసం ఆమె ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో చేరిన రోజు నుండి కొడుకు సువైతి మనసులో మనసులో లేదు.తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఎలా ఉందో చూడాలని కొడుకు భావించాడు.
also read:షాక్: పరీక్ష చేయకుండానే కరోనా పాజిటివ్ అంటూ మహిళకు మేసేజ్
ఆమె దగ్గరకు వెళ్తే కరోనా సోకే అవకాశం ఉందని భావించాడు. దీంతో తల్లిని చూసేందుకు ఆయన ఓ ఆలోచన చేశాడు. ఆసుపత్రి గోడెక్కి కిటికి దగ్గర కూర్చొని తల్లిని చూసుకొన్నాడు. ప్రతి రోజూ తల్లిని ఇలా చూసుకొనేవాడు. మంగళవారం నాడు సాయంత్రం కొడుకును చూసిన తర్వాత తల్లి కన్నుమూసింది.
ఈ విషయాన్ని సామాజిక కార్యకర్త మహమ్మద్ సఫా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తల్లి కోసం తల్లడిల్లిన వ్యక్తి ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ తల్లి ఎంత గొప్ప కొడుకు అంటూ సువైతీని పలువురు అభినందనల్లో ముంచెత్తారు. ఈ పోస్టును చదివిన పలువురు నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు.